Home కరీంనగర్ కరీంనగర్ ధాన్యాగారంగా ప్రసిద్ధికెక్కింది

కరీంనగర్ ధాన్యాగారంగా ప్రసిద్ధికెక్కింది

Karimnagar became known as the Granadi
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్

మనతెలంగాణ/కరీంనగర్‌ : కరీంనగర్ జిల్లా ధాన్యాగారంగా ప్రసిద్ధికెక్కిందని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖామాత్యులు ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం నాడు బొమ్మకల్ బైపాస్ రోడ్డులో గల తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన సిసి రోడ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని అందులో కరీంనగర్ జిల్లా ధాన్యగారంగా ప్రసిద్ధికెక్కిందని మంత్రి అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ధాన్యగారంగాఉండేదని ప్రస్తుతం తెలంగాణ ధాన్యాగార రాష్ట్రంగా మారిందని మంత్రి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్ర వేశపెట్టిన రైతుబంధు,వ్యవసాయ పెట్టుబడి పథకం, రైతు బీమా పథకం రైతుల మన్ననలు పొంది దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి అన్నారు.గతంలో ధాన్యం నిల్వ చేయుటకు ప్రభుత్వ గోదాములు లేవని ప్రైవేట్ గోదా ములపై ప్రభుత్వం ఆధారపడేదని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 18 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధం గల గోదాముల నిర్మించిందని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక జలహరంగా మారబోతుందని మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, సుంది ళ్ల,మేడిగడ్డ ప్రాజెక్టులు పూర్తయితే రాబోయే కాలంలో గొప్పగా పం టలు పండించుకోవచ్చని ఆయన అన్నారు.
నిల్వ పెట్టిన ధాన్యం చెడిపోకుండా చూసుకోవలసిన బాధ్యత మన పై ఉందని మంత్రి తెలిపారు.రైతులు కష్టపడి పంటలు పండిస్తారు కాబ ట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని మంత్రి అన్నారు. 201617 సం వత్సరంలో దేశంలో గిడ్డంగుల సంస్థ నంబర్‌వన్‌గా నిలిచిందని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామెల్ మా ట్లాడుతూ గిడ్డంగుల సంస్థ దేశంలో అనతికాలంలోనే చరిత్రలో ముం దుభాగంలో ఉన్నందున గర్వపడుతున్నానని అన్నారు.
గోదాములను ధాన్యంతో నింపి తెలంగాణ అన్నపూర్ణగా ఎలాంటి కరువు లేకుండా కాపాడుకుందామని ఆయన అన్నారు. ప్రజాసంక్షేమంలో భాగంగా ఆసరా పింఛన్లు, వికలాంగుల ఫించన్లు, బోదకాలు వారికి కూడా పెన్షన్లు ప్రభు త్వం ఇస్తుందని ఎస్.సి, ఎస్.టి హాస్టళ్లలో సన్నబియ్యం భొజనం పెడుతు న్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపిపి వాసాల రమేష్, సర్పంచ్ లలిత, పెద్దపల్లి గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్ తదితరులు పా ల్గొన్నారు.