Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కరీంనగర్ అభివృద్ధికి రూ. 500 కోట్లు

eetala-rajendar-image

ఈటల నాకు ప్రీతిపాత్రమైన తమ్ముడు
అప్పు చేసైనా కరీంనగర్‌కు నధులు కేటాయిస్తా
తెలివిలేదన్న తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ నుంచి సివిల్స్ టాపర్
కరీంనగర్‌లో ఏ పని ప్రారంభించినా విజయమే

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి/హుజురాబాద్ టౌన్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను తనకు ప్రీతిపాత్రమైన తమ్ముడిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్దికి రూ. 500 కోట్లు కేటాయించాలని రైతు బంధు బహిరంగ సభలో ఆయన చేసిన విజ్ఞప్తికి స్పందించిన ముఖ్యమంత్రి “రాజేందర్ నాకు దగ్గరి మనిషి… ఆత్మీయుడు…” కనుక అప్పు తెచ్చి అయినా ఆ మొత్తం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. హుజురాబాద్ మండలం శాలపల్లిలో రైతు బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరీంనగర్ అంటే తనకు వ్యక్తిగతమైన నమ్మకం అన్నారు. ఇక్కడ ఏ పని ప్రారంభించినా అది నూటికి నూరు శాతం విజయం సాధిస్తున్నదని చెప్పారు. ఈ జిల్లా తెలంగాణ ఉద్యమ బావుటాను ఆకాశమంత ఎత్తుకు ఎగురవేసిందన్నారు. అందుకే నాటి సింహగర్జన మొదలు అనేక కార్యక్రమాలకు కరీంనగర్ జిల్లా వేదికగా నిలుస్తుందని చెప్పారు. ఆంధ్రపాలకులు తరచూ… మీకు తెలివేలేదన్న తెలంగాణలో… సివిల్స్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెట్‌పల్లికి చెందిన అనుదీప్ మొదటి ర్యాంక్ సాధించి రాష్ట్రం సత్తాఏమిటో చాటారని అన్నారు. అనుదీప్ మాత్రమే కాకుండా మరో ఆరుగురికి పైగా సివిల్స్‌లో అత్యున్నత ర్యాంకులు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యుత్ సమస్య కారణంగా జమ్మికుంటకు చెందిన భిక్షపతి అనే యువకుడు చనిపోతే, ఉద్యమ సమయంలో

Comments

comments