Home కరీంనగర్ కరువు రహిత జిల్లాగా కరీంనగర్

కరువు రహిత జిల్లాగా కరీంనగర్

Karimnagar is a drought-free district

మనతెలంగాణ/కరీంనగర్‌: మరో యేడాది లో గా కరువు అంటే ఏమిటో తెలియని జిల్లాగా కరీంనగర్ రూపుదిద్దుకోబోతుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని స్థానిక పోలీస్ కవాతు మైదానంలో శనివారం పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం శీఘ్రగతిన చేపడుతున్న ప్రాజెకు ల కారణంగా పాత పది జిల్లాల్లోని ఏడు జిల్లాలకు నీటి నిఅందించే హబ్‌గా కరీంనగర్ జిల్లా మారబోతుందన్నా రు.దశాబ్దాల క్రితం నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గ త పాలకుల నిర్లక్షం కారణంగా చివరి ఆయకట్టుకు నీ రందించలేని దుస్థితికి చేరుకుందన్నారు. సమైఖ్య పాలనలో ధ్వంసమైన చెరువులను మిషన్ కాకతీయ పథకం కింద పునరుద్ధరించే కార్యక్రమం ఇప్పటికి నాలుగు ద శలు పూర్తయిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా ఉన్న కరీంనగర్ జిల్లాను సీడ్ బౌల్ ఆ ఫ్ ఇండియాగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుందన్నా రు.రైతాంగ అవసరాల కోసం 24గంటలు నాణ్యమైన విద్యుత్‌ను పంపిణీ చేస్తున్న రాష్ట్రం దేశంలో మరోకటి లే దన్నారు.రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో 1,46,0 27 మంది రైతులకు రూ.124.58 కోట్లు పెట్టుబడి స హాయంగా ప్రభుత్వం అందించిందన్నారు. వచ్చే ఆగస్టు నుండి రైతులకు రూ.5 లక్షల బీమా పథకాన్ని వర్తించబోతున్నామని చెప్పారు.మిషన్ భగీరథ పథకంలో భా గంగా గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం పనులు యుద్దప్రాతిపదికన పూర్తిచేసి అక్టోబర్ నాటికి ప్రతి ఇ ంటికి తాగునీరు  అందిస్తామని తెలిపారు.చిన్న రాష్ట్రం అయినా,కొత్త రాష్ట్రం అయినా 20శాతం ఆదాయాభివృద్దిరేట్‌తో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. అనతికాలంలోనే సాధించిన ఈ విజయాలు తెలంగాణ బిడ్డలకు గర్వకారణమని అన్నారు.