Home కరీంనగర్ కరీంనగర్ మరోమారు క్రీడలకు వేదిక

కరీంనగర్ మరోమారు క్రీడలకు వేదిక

 

sports

*పిల్లల ఆత్మరక్షణకోసం కరాటే క్రీడల్లో చేర్చాలి
*19 నుంచి జాతీయ స్థాయి
సిఎం కప్ కరాటే టోర్నమెంట్
*కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్

మనతెలంగాణ/కరీంనగర్‌టౌన్: కరీంనగర్ క్రీడలకు నిలయమని మరో సిఎం కప్ 2018 జాతీయ కరాటే టోర్నమెంట్‌కు వేదికకానుందని కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్ అన్నారు. గురువారం నగరం లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియం చీఫ్ మినిస్టర్-2018 కరాటే జాతీయ స్థాయి పోటీలకు వేదికకానుందన్నారు. ఈ నెల 19నుండి 21వ తేదీ వరకు జాతీయ కరాటే జరుగుతుందని తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంగా సిఎం కప్ కరాటే పోటీలు గత రెండు సం వత్సరాలుగా నిర్వహించడం జరిగిందని, ఈ ఏడాది కూడా ఘనంగా ని ర్వహించడం జరుగుతుందన్నారు. కరాటే పోటీలకు 24రాష్ట్రాల నుంచి 1500 మంది క్రీడకారాలు పాల్గొంటురని తెలిపారు. కరాటే క్రీడను ఒలింపిక్స్‌లో చేర్చిన తరువాత మన రాష్ట్రం, మన జిల్లాలో మూడవసారి జరుగుతున్న సిఎం కప్‌కు భారీగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. క్రీడకారులకు అన్ని వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. సిఎం కప్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథులుగా మంత్రులు టి. పద్మారావు, ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సినీ హీరో సుమన్ తదితర ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ పిల్లల ఆత్మరక్షణ కోసం కరాటే ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ క్రీడల్లో పాఠ్యాంశంలో చేర్చాలన్నారు. క్రీడల్లో కూడా కరాటేను చేర్చి పిల్లలకు నేర్పించాలని ఆకాంక్షించారు. మూడవసారి కరీంనగర్‌లో సిఎం కప్ జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్ జరగడం ఎంతో అభినందనీయమన్నారు. టోర్నమెంట్ వర్కింగ్ ప్రెసిండెంట్ చల్ల హరిశంకర్ మాట్లాడుతూ మూడు రోజులు జరిగే సిఎం కప్ కరాటే టోర్నమెంట్‌కు క్రీడకారులకు అన్ని రకాల వసతులు, సదుపాయలు కల్పించామని తెలిపారు. టోర్నమెంట్ చీఫ్ ఆర్గనేషన్ ఈ శ్రీనివాస్ మాట్లాడుతూ సిఎం కప్ జాతీయ స్థాయి కరాటే పోటీలు కరీంనగర్ జిల్లా కేంద్రంగా 2014, 2016, 2018 లో నిర్వహించడం జరుగుతుందన్నారు. మూడవసారి కూడా భారీ ఎత్తున ఈ కరాటే పోటీలను అందరి సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడకారలు అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చేయాలని కోరారు. అంతకు ముందు కరాటే క్రీడ బ్రోచర్‌లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నందెల్లి మహిపాల్, గౌరు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.