Home కరీంనగర్ కరాటేలో కరీంనగర్ ముందంజ

కరాటేలో కరీంనగర్ ముందంజ

female-image

మహిళలు కరాటేలో రాణించడం అభినందనీయం
ప్రభుత్వ ప్రోత్సహన్ని అందిస్తాం
అంతర్జాతీయ కరాటే క్రీడకారులను సన్మానించిన
జడ్‌పి చైర్ పర్సన్ తుల ఉమ

మనతెలంగాణ/కరీంనగర్‌స్పోర్ట్: మార్షల్ ఆర్ట్ కరాటే లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముందంజలో ఉండడం సం తోషంగా ఉందని జడ్‌పి చైర్ పర్సన్ తుల ఉమ అన్నారు. బుధవారం మలేషియా అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలకు తెలంగాణజట్టుకు ఎంపికైన క్రీడాకారుల అభినందన సందర్భంగా ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో జడ్‌పి చైర్ పర్సన్ తుల ఉమ మాట్లాడా రు.జిల్లాలో అంజనజాతీయ,అంతర్జాతీయ స్థాయిలో 219 పతకాలు శ్వేత 32పతకాలు అందుకొని పురుషులకు దీ టుగా మహిళలు కరాటేలో రాణించడం అభినందనీయమ న్నారు.ఒలంపిక్ 20-20లో కరాటే క్రీడను చేర్చడం ప్రాచుర్యంలోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా క రాటే క్రీడకారులకు విద్య ఉపాధి ఆర్థిక సహాయం అందించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. కాంటినెంట ల్ షోటోకాన్ కరాటే డో ఇండియా నేషనల్ అకాడమి జిల్లా క్రీడాకారులు మలేషియాలో ఈ నెల 2నుంచి 8వరకు జరు గు అంతర్జాతీయ ఓపెన్ కరాటే పోటీలకు రాష్ట్ర జట్లులో 9 మందిక్రీడాకారలు ఎంపిక కావడం విశేషమన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించి ఒలంపిక్ స్థాయికి క్రీడాకారులు ఎదగాలని ఆకాంక్షించారు. కాంటినెంటల్ షోటోకాన్ జిల్లా చైర్మన్ చల్ల హరిశంకర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా కేంద్రంగా మూడు సార్లు జాతీయ స్థాయి సిఎం కప్ పోటీలు నిర్వహించక జిల్లా క్రీడాకారులు 100కు పైగా పతకాలు సాధించడం మరో విశేషమ ని అన్నారు. కాంటినెంటల్ షోటోకాన్ డో ఇండియా చీఫ్ ఇ. శ్రీనివాస్ మాట్లాడుతూ కరాటే క్రీడను ఒలంపిక్ లో చేర్చడం ద్వారా చాలా మార్పులకు గురైందని పేర్కొన్నా రు.వరల్డ్ కరాటే ఫెడరేషన్ గుర్తించి స్టైల్స్ అకాడమిలోని విద్యార్థులకు మాత్రమే ఒలంపిక్ ఎంపికకు అర్హత ఉంటుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు అం దించిన క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మధ్యప్రదేశ్‌లో రాణించిన రాష్ట్రంలో పతకాలు సాధించిన వారికి రూ.20లక్షలఆర్థిక సహాయం అందిస్తుండగా హర్యానాలో 11లక్షలు, భారత్ 3లక్షలు మాత్రమే అందించడం బాధాకరమని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పతకాలు అందిస్తున్న ఇ.అం జనకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం ఇప్పించుటకు జడ్‌పి చైర్ పర్సన్ తుల ఉమ చొరవ చూపాలని కోరారు. అనంతరం మలేషియా లో జరుగు అంతర్జాతీ య ఓపెన్ కరాటే పోటీలకు ఎంపికైనా సీనియక్ క్యాటగిరి ఇ..అంజన, జి.శ్వేత, జూనియర్ క్యాటగిరి విభాగంలో ఎం.చంద్రవర్ధన్, సబ్ జూనియర్ క్యాటగిరి విభాగంలో ఎం,అదిత్యవర్థన్, ఎండి జునైద్ ఆలీ, సిహెచ్ చరణ్‌తేజు, వై, సిరి, జె. శ్రీచరణ్, వై. విశ్వక్‌సేన్ ఎంపిక కాగా జడ్‌పి చైర్ పర్సన్ తుల ఉమ పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఈ కార్యక్రమ ంలో కాంటినెంటల్ షోటోకాన్ కార్యదర్శి ఎం. ప్రవీణ్, కోశాధికారి వంగల శ్రీధర్, సభ్యులు ప్రసన్న కృష్ణ లు పా ల్గొని వారిని అభినందించారు.

కరాటే డోజో ఏర్పాటే నా లక్షం
ఆత్మరక్షణ కోసం కరాటేలో చేరాను. కోచ్ ఇ. శ్రీనివాస్ త ల్లిదండ్రులప్రోత్సాహంతో జాతీయ,అంతర్జాతీయ స్థాయి లో 219 పతకాలు సాధించాను. ప్రస్తుతం మహిళలు, బా లికలపై అత్యాచార ఘటనలు,మనస్సు చలింపచేస్తుంది. అందుకోసం కరీంనగర్‌లో కరాటే డోజు ఏర్పాటు చేసి ఆ త్మరక్షణ కోసం ఉచిత శిక్ష ణ ఇవ్వడమేనా లక్షం. సి ఎం కెసిఆర్ కరాటే ప్రతిభ ను గుర్తించి విద్య ఉపాధిలో బాలికలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. హైదరాబాద్‌లో సిఎంఆర్ కళాశాలలో ఎంటెక్ చేస్తూ ఆత్మరక్షణ కోసం కరాటేతో ప్రేరణ కల్పిస్తున్న అంజన అభిప్రాయం.
-అంతర్జాతీయ క్రీడకారిణి అంజన
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..కరాటేలో రాణింపు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మి ంచిన శ్వేత కరీంనగర్‌లో అ పూర్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతుంది.
ఆత్మరక్షణ కోసం మహిళల కు కరాటే తప్పని సరి అని త మ తల్లిదండ్రుల ప్రోత్సాహం తో, కోచ్ ఇ. శ్రీనివాస్ పర్యవేక్షణలో జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో 32పతకాలు సా ధించానని తెలిపారు. ప్రభుత్వ పరంగా కరాటే ను గుర్తించి విద్య,ఉపాధి రంగాలతో పాటు ఆర్థిక సహాయాన్ని అందిస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి ఒలంపిక్‌కు ఎంపికై పతకాలు సా ధిస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. -జి.శ్వేత