Home కరీంనగర్ కరీం‘నగరం’రూపు రేఖలు మారుస్తాం

కరీం‘నగరం’రూపు రేఖలు మారుస్తాం

speak

*స్మార్ట్ సిటీలో భాగంగానే పనులు
*జవాబుదారితనంగా పని చేస్తాం
*కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్

మనతెలంగాణ/కరీంనగర్‌టౌన్:స్మార్ట్ సిటీలో భాగంగా క రీంనగర్ రూపురేఖలు మారుస్తామని కరీంనగర్ ఎంపి వినో ద్‌కుమార్ అన్నారు. మంగళవారం నగరంలోని 21వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో 12కోట్ల 7 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గ ంగుల కమలాకర్,ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మే యర్ రవీందర్ సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేశ్, కమిషనర్ శశాంక్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అభివృద్ధి పట్టించుకోలేదన్నారు.తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిం ది మన బతుకులు మార్చడానికేనని, రాష్ట్రాన్ని సాధించిన తరువాత సిఎం కెసిఆర్ నాయకత్వంలో పలు పథకాలు, ప లు కార్యక్రమాలు మొదలు పెట్టి ముందుకు సాగుతున్నామన్నారు. నాలుగు సంవత్సరాలోపల స్మార్ట్ సిటీ నిధులు వే య్యి కోట్లు నగరానికి వస్తాయని అన్నారు. హౌసింగ్ బోర్డు పరిధిలోని ప్రధాన రోడ్లను త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.180 కోట్లతో కమాన్ నుండి సదాశివ్‌పల్లి వరకు రో డ్డు వేసి దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని సస్పెన్షన్ వంతెనను నిర్మిస్తున్నామని,పనులను ప్రారంభించామని తెలిపా రు. ఈ వంతెన పూర్తయిన తర్వత హౌసింగ్ బోర్డు కాలనీకి మరింత కళ వస్తుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో మేము ప్రజలకు జవాబుదారీ త నంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్షం వల్లనే కరీంనగర్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాడ్రన్ కాలనీగా హౌసింగ్ బోర్డు అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజల రుణం తీర్చుకోవడానికే ప్రజల మధ్యనే ఉం టున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ మహిళ భవన నిర్మాణం కోసం ఎన్ని నిధులై నా తాను అందిస్తానని హామీ ఇచ్చారు. నగర మేయర్ స ర్ధార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీలోని భాగంగానే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. హౌ సింగ్ బోర్డు కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చే స్తామన్నారు. కాలనీని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూందన్నారు. అందుకు నిదర్శనం నగరానికి వచ్చిన వందలాది కోట్లే నిదర్శనం అన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ శశాంక మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కరీంనగర్ అంటే చాలా ఇష్టమని అన్నారు. నగర అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తారని నమ్మకం ఉందని తెలిపారు. నిధులతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని సూచించారు. కార్పోరేటర్ ఆకుల ప్రకాష్ మాట్లాడుతూ తన డివిజన్‌ను స్మార్ట్ సిటీలో భాగంగా చేసి నిధులను కేటాయించడం చాలా సం తోషదాయకమన్నారు. ఇందుకుగాను ఎంపి, ఎంఎల్‌ఎ, మే యర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు, గర్రెపల్లి సత్యనారాయణ, శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.
నగరంలో 46వ డివిజన్‌లో..
నగరంలో 46వ డివిజన్ జ్యోతినగర్‌లో స్థానిక కార్పొరేటర్ రాపర్తి విజయతో కలిసి అమృత్ పార్క్ పనులకు కొబ్బరి కా య కొట్టి పనులకు ఎంపి వినోద్‌కుమార్ శంకుస్థాపన చే శారు.57లక్షల నిధులతో అమృత్ పార్కు అభివృద్ధి, పార్క్ లో డివిజన్ ప్రజల సౌకర్యార్థం వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, పాత వేస్, ఆట పరికరాలు, వాష్ రూంలు, అంపీ థియేటర్ లా ంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం 83 లక్షలతో మల్టీపర్పస్ స్కూల్ పహారితో పాటు 72 లక్షలతో సర్కస్ గ్రౌండ్ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చే శారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ పా ర్కుతో పాటు డివిజన్లలో ఉన్న అన్ని పార్కులను ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.ప్రజల సౌకర్యం కోసం పార్కుల్లో వాకింగ్ ట్రాక్స్ నిర్మిస్తామని పేర్కొన్నారు.చిన్న పిల్లలు సాయంకాల సమయంలో ఆడుకోవడానికి ఆట పరికరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.పచ్చని వాతావరణం ఉండే విధంగా గ్రాస్, వాష్ రూంను కూడా పార్కులో ఏర్పాటు చేస్తామని అన్నారు. మరి కొద్ది రోజుల్లో స్మార్ట్ సిటీ హంగులతో నగరం సుందరంగా మారనుందని తెలిపారు. సర్కస్ గ్రౌండ్, మల్టిపర్పస్ స్కూల్ అభివృద్ధి పనులు కూడా ప్రారంభించామని పేర్కొన్నారు. వేగవంతంగా అభివృద్ధి పనులు చేపట్టి స్మార్ట్ సిటీలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రజా ప్రతినిధులుగా మా బాధ్యత అన్నారు. శారీరక దారుఢ్యం పెంచుకొని ఆరోగ్యవంతులుగా ఉండేందుకు న గరంలోని అన్ని డివిజన్లలో నగరపాలక సంస్థ ఆధ్వర్యం లో ఒపెన్ జిమ్‌ల ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లతో పాటు మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.