Search
Sunday 18 November 2018
  • :
  • :

ర్యాంప్‌వాక్‌తో కరిష్మా సందడి

karishmaహైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్చిత నారాయణన్ కలెక్షన్‌ను ప్రదర్శించిన లాక్మే ఫ్యాషన్ వీక్ వింటర్/ఫెస్టివ్ 2016 దేశంలోని ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ మెరుపుతీగ కరిష్మాకపూర్ ఈ ఫ్యాషన్ వీక్, పరినికా జ్యూయలరీ ప్రదర్శనలో తళుక్కున మెరిసి అలరించింది. ముంబైలోని సెయింట్ రేగీస్‌లో ఎల్‌ఎఫ్‌డబ్ల్యు స్టేజ్ వన్‌పై జరిగిన ఈ ఫ్యాషన్ వీక్‌లోని చివరిరోజున అర్చిత డిజైన్ చేసిన బ్రైడల్ కలెక్షన్ ఆహూతులను అబ్బురపరిచింది. ఇకపై తాను ఫ్యాషన్ షోలతోపాటు సినిమాలపై కూడా దృష్టి పెడుతున్నట్లు ఈ సందర్భంగా కరిష్మా పేర్కొంది. కరిష్మా కపూర్ పలు సినిమాలో హీరోయిన్‌గా చేసింది. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె కేరక్టర్ ఆర్టిస్ట్‌గా నిలబడే ప్రయత్నంలో వున్నట్లు బాలీవుడ్ చర్చ జరుగుతోంది.

Comments

comments