Home జాతీయ వార్తలు త్వరగా కరవు సాయం

త్వరగా కరవు సాయం

KumaraSwamy

న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలుసుకొని, ప్రస్తుత రబీ సీజన్‌లో కరవు రైతుల్ని ఆదుకోడానికి రూ.2,064.30 కోట్ల నిధుల్ని త్వరగా విడుదల చేయాల్సిందిగా కోరారు. రబీలోనే కాక, ఈ ఏడాది ఖరీఫ్‌లో కూడా రాష్ట్రం కరవును ఎదుర్కొందని, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయం చాలదని కుమారస్వామి ప్రధాని మోడీకి వివరించారు. వరదలకు తోడు 2018-19 పంట సంవత్సరంలో ఖరీఫ్ (వేసవి), రబీ (శీతాకాలం) కర్ణాటక తీవ్రమైన కరవు తాకిడికి గురైంది. ‘వరసగా కరవు, వరదలు రావడంతో రైతులు విపరీతమైన కష్ట నష్టాలకు గురయ్యారు. ఇప్పుడు వారిని ఆదుకోవాల్సిన సమయం వచ్చింది’ అని కుమారస్వామి ప్రధానికి తెలిపారు. కరవు రైతుల్ని ఆదుకునేందుకు ఇచ్చే రూ.2,064.30 కోట్ల సహాయాన్ని విడుదల చేసే ప్రక్రియను వేగవంతం చేయవలసిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి కోరారు. రూ.2,064.30 కోట్ల కరవు సహాయ నిధుల్ని మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చింది. రబీ సీజన్ పంట నష్టం రూ.11,384.7 కోట్లుగా అంచనావేశాం. రాష్ట్రంలోని 176 తాలూకాల్లో 156 కరవు తాలూకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరవు వల్ల రైతులు పడుతున్న ఇబ్బందుల్ని తక్కువ చేసేందుకు మోడీ చేస్తున్న కృషిని కుమారస్వామి ఈ సమావేశంలో కొనియాడారు.

Karnataka Cm KumaraSwamy Meets Pm Modi