Home Default కన్నీరు పెట్టుకున్న సినీ ప్రముఖులు

కన్నీరు పెట్టుకున్న సినీ ప్రముఖులు

Aambaarish

కన్నడ సీనియర్ స్టార్ అంబరీష్‌కు పలువురు సినీ ప్రముఖులు ఘన నివాళులర్పించారు. బెంగుళూర్‌లోని కంఠీరవ స్టేడియంలో ఉంచిన ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు వచ్చిన పెద్ద స్టార్లు సైతం దుఃఖాన్ని దిగమింగుకోలేక కన్నీరు పెట్టుకోవడం అందరినీ కదిలించింది. మెగాస్టార్ చిరంజీవి అంబరీష్‌కు నివాళులర్పించి సుమలతను ఓదార్చే క్రమంలో తాను కూడా కన్నీటి పర్యంతం కావడం అక్కడ ఉన్నవాళ్ల హృదయాలను బరువెక్కించింది. భార్య సురేఖతో పాటు వెళ్లిన చిరు కళ్లను తుడుచుకోవడం అందరి కంట పడింది. ఇక మం చు విష్ణుతో పాటు వచ్చిన సీనియర్ నటుడు మోహన్‌బాబు అంబరీష్ మృతదేహం ఉన్న బాక్సు అద్దం మీద భోరుమని విలపిస్తుంటే ఓదార్చడం ఎవరి తరం కాలేదు. సుమలతను ఓ దారుస్తున్నప్పుడు కన్నీరు ధారగా వస్తూనే ఉంది. చాలా నిబ్బరంగా ఉండే మోహన్‌బాబు ఇం తగా విలపించడం గతంలో ఎన్నడూ లేదనే చెప్పవచ్చు. ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్ సైతం దీనికి మినహాయింపు కాలేదు. సుమలతను ఓదార్చే క్రమంలో ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. అంబరీష్‌కు ఆప్తుడైన కన్నడ స్టార్ సుదీప్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అజాత శత్రువుగా పేరుగాంచిన అంబరీష్ మరణం పెద్ద స్టార్లను సైతం కదిలించింది అంటే ఆయనకు వీళ్లతో ఉన్న అనుబంధం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇక రాధిక, శరత్‌కుమార్, లక్ష్మీ తదితర సినీ ప్రముఖులు అంబరీష్ మృతదేహానికి పూల మాలలతో నివాళులర్పించారు.
సినీ ప్రముఖుల సంతాపం…
అంబరీష్ ఆత్మ శాంతించాని కోరుకుంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తంచేశారు.
ఓ గొప్ప వ్యక్తిని, నా స్నేహితుడిని కోల్పోయాను. నిన్ను ఎప్పుడూ మిస్సవుతూనే ఉంటాను – – రజనీకాంత్
నా నిజమైన స్నేహితుడు దూరమయ్యాడు. ఈ రోజు నన్ను నేను కోల్పోయాను.– మోహన్‌బాబు
ఎంతో గొప్ప వ్యక్తి. మిమ్మల్ని చాలా మిస్సవుతాం. సుమలత, కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. – -రాధిక శరత్‌కుమార్
అంబరీష్ మరణ వార్త విని షాకయ్యాను. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నా గొప్ప స్నేహితుడు ఇంత త్వరగా వెళ్లిపోయి మమ్మల్ని శోక సంద్రంలోకి నెట్టేశారు. — – ఖుష్బూ
కన్నడ సీమలో రెబల్ స్టార్‌గా జేజేలందుకున్న అంబరీష్ మృతి నన్ను దిగ్భ్రాంతికి గురిచేసిం ది. కన్నడ పరిశ్రమ మరో గొప్ప నటుడిని కోల్పోయింది. – -‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా

Karnataka Senior Actor Ambareesh Passes Away

Telangana News