Home ఆఫ్ బీట్ వీడియోలు లోను కావాలా? అయితే నా కోరిక తీర్చు!(వీడియో)

లోను కావాలా? అయితే నా కోరిక తీర్చు!(వీడియో)

Karnataka woman thrashes Bank manager who ask sexual favours

బెంగళూరు: లోను కావాలంటే తన కోరిక తీర్చాలన్న బ్యాంక్ మేనేజర్ కు ఓ మహిళ దేహశుద్ధి చేసిన సంఘటన కర్ణాటకలోని దావణగెరెలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ మహిళ తన అవసరాల నిమిత్తం లోను కోసం సమీపంలోని బ్యాంకుకు వెళ్లింది. లోను ప్రాసెస్ లో భాగంగా ఆమె సదరు బ్యాంక్ మేనేజర్ ను కలిసింది. అయితే, లోను మంజూరు చేయాలంటే తన కోరిక తీర్చాలని బ్యాంక్ మేనేజర్ మహిళకు చెప్పాడు. దాంతో ఒక బాధ్యతయుత పదవీలో ఉంటూ మహిళతో ఇలా అసహ్యంగా మాట్లాడుతావా అంటూ అతడిని బ్యాంక్ నుంచి బయటకు ఈడ్చుకువచ్చి కర్ర తీసుకుని చితకబాదింది. అనతంరం చెప్పుతో దేహశుద్ధి చేసింది. దీంతో బ్యాంక్ మేనేజర్ చేసేదేమిలేక మహిళ కాళ్లు పట్టుకుని తనను వదిలివేయాలని, మళ్లీ ఇలాంటి తప్పు చేయనని వేడుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు మహిళను ప్రశంసిస్తున్నారు. ఆమెను సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో సదరు బ్యాంక్ మేనేజర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Karnataka woman thrashes Bank manager who ask sexual favours.