Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

సెమీస్‌లో ఓడిన సెరెనా

Serenaన్యూయార్క్: అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవాలన్న ఆమె ఆశలపై చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా నీళ్లు చల్లింది. యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సెమీఫైనల్లో సెరెనాను ఓడించి కరోలినా ఫైనల్‌కు చేరింది. అగ్రస్థానంలో కొనసాగుతున్న సెరెనా.. 10 సీడ్ ప్లిస్కోవా చేతిలో 2-6, 7-6(7/5) తేడాతో పరాజయం పాలవడం గమనార్హం. 1993 తర్వాత యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి ప్రవేశించడం ఇదే మొదటిసారి. కెబర్‌తో ఫైనల్లో కరోలినా ప్లిస్కోవా తలపడనుంది. ‘సెరెనాను ఓడించడం నమ్మలేకపోతున్నానని సెమీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లిస్కోవా వ్యాఖ్యానించింది. ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సెరెనా లాంటి గొప్ప క్రీడాకారిణిని ఓడించడం చాలా సంతోషంగా ఉంద’ని ప్లిస్కోవా పేర్కొంది. కాగా, ఫైనల్ మ్యాచ్ శనివారం జరగనుంది.

Comments

comments