Home సినిమా సౌత్ మీదే ఫోకస్

సౌత్ మీదే ఫోకస్

karthi and rakul preet singh movie dev release date

మొన్నటిదాకా టాలీవుడ్ స్టార్లందరితోనూ వరుసగా సినిమాలు చేసి టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రకుల్‌ప్రీత్ సింగ్. అయితే ఈమధ్య ఆమెకు తెలుగులో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. హిందీలో ఆమె చేసిన ‘అయారి’ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. అందుకే కోలీవుడ్‌లో నిలదొక్కుకుందామని రకుల్ ప్రయత్నాలు చేస్తోంది. గత ఏడాది కార్తి సరసన చేసిన ‘ఖాకీ’ ఈ భామకు అక్కడ మంచి పేరును తీసుకొచ్చింది. ఆ జోష్‌తోనే అదే కార్తీతో రకుల్ చేసిన ‘దేవ్’ చిత్రం ఈనెలలోనే విడుదల కానుంది. అడ్వెంచర్లు చేసే హీరోతో ప్రేమలో పడే అమ్మాయిగా రకుల్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలిసింది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం హిట్ అయితే కోలీవుడ్, టాలీవుడ్‌లలో తనకు మంచి ఆఫర్లు వస్తాయని రకుల్ భావిస్తోంది. ఇక ప్రస్తుతం రకుల్ మరో హిందీ సినిమా కూడా చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ భామ ఫోకస్ అంతా సౌత్ మీదే ఉంది.

karthi and rakul preet singh movie dev release date