Search
Friday 16 November 2018
  • :
  • :

తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం

– తెలంగాణ వస్తే ధర్నాలే ఉండవన్న ముఖ్యమంత్రి – రాష్ట్రంలో ప్రతి విషయానికి ధర్నాలు చేస్తున్నారు
– రెండు సంవత్సరాలు దాటినా ఏ ఒక్క సమస్య తీర్చలేదు
– నిరుద్యోగులను మోసం చేస్తున్నకెసిఆర్ ప్రభుత్వం – ముఖ్యమంత్రి అనుకుంటే అధ్యాపకుల సమస్యల సమస్సే కాదు
– కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్తిక్‌రెడ్డి

KARTIK

మన తెలంగాణ/వికారాబాద్ రూరల్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉండని, వ్యవసాయ ధారుల ఆకలి చావులుండవని, కాంట్రాక్టు వ్యవస్తే ఉండదని చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి  చంద్రశేఖర్‌రావు ఆయన పదవి చేపట్టిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని సమస్యలు ఎక్కువయ్యాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్తిక్‌రెడ్డి ఆరోపించారు.

శుక్రవా రం వికారాబాద్ ఆర్డీఓ ఆఫీసు ముందు రిలే దీక్షలు చేస్తున్న కాంట్రాక్టు అధ్యాప కులకు ఆయన ముద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా ర్థులు, అధ్యాపకులు, గ్రామాల నుంచి యువకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని మేమే తెచ్చామని చెప్పుకుంటు ప్రజ లను మోసం చేస్తుందన్నారు. కాంట్రాక్టు ప్రాతిపాధికన నియమించిన అధ్యాపకులు కోర్టు తీర్పురావాలనే కాలయాపన చేస్తుంనది ముఖ్యమంత్రి అనుకుంటే 10వ పీఆర్సి ప్రకారం రూ. 37 వేల జీతం ఇవ్వడం పెద్ద సమస్సే కాదన్నారు. ముఖ్య మంత్రి తిరిగే కారు, కేసీఆర్ విదేశాల పర్యటన, కవితమ్మ విదేశాల్లో బతుకమ్మ సంభరాలకు నిధులు పుష్కలంగా ఉంటాయి కానీ ఇలాంటి ఉద్యోగుల సమస్య తీర్చుడానికి మీ డొంకతిరుగుడు సమస్యలు చెప్పుతున్నారని ఆరోపించారు. తెలం గాణ వస్తే ఆంధ్ర పెట్టుబడి ధారుల సమస్యలు తీరుతాయనకుంటు మిషన్ భగీరథ పనులన్ని ఆంధ్ర కాంట్రాక్టులకే అప్పగించి తెలంగాణ ప్రజల కష్టాన్ని మోత్తం వారికే అప్పగించారని తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల పేర్లు చెప్పి రాష్ట్రాంలో రైతులను, ప్రజలను ఎంతో మోసం చేస్తున్నారన్నారు.

వారి సొంత ఖర్చులకోసం కోట్లకు కోట్లు ఖర్చుచేస్తున్న ముఖ్యమంత్రి నిరుద్యోగుతు, కాంట్రాక్టు ప్రాతిపాధిక పనిచేస్తున్న వారు, విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్ మెంట్ లాంటి సమస్య లు మాత్రం వారికి కనిపించడం లేదని ఉస్మానియా యూనివర్సి మెస్ బిల్లు రూ. 7 కోట్లు ప్రభుత్వంలోకి రాగానే కట్టేస్తామన్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ బిల్లు చెల్లిం చలేని దుస్థితిలో ఉందన్నారు. మిగులు బడ్జెట్ అని చెప్పుకోవడానికే తప్పా అన్ని అప్పులే అనని రాష్ట్ర ప్రజలను మాత్రం కేసీఆర్ మసి పూసి మారడిగాయ చేస్తున్నా డని మాటల గారడితో ప్రజలను మోసం చేస్తున్నారని ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యను పరిష్కరిం చేంత వరకు పోరాటాలు చేయాలని మీకు మా పార్టీ మద్దతు ఎప్పుడు ఉంటుం దన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అఫిజ్, కిషన్ నాయక్, మహిపాల్‌రెడ్డి  పాల్గొన్నారు. టీడీపీ జిల్లా నాయకులు సుభాష్‌యాదవ్, ఉమా శంక ర్, రంగరాజ్, రవి, రాజేష్‌లు కూడా కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతు తెలిపారు.

Comments

comments