Search
Wednesday 26 September 2018
  • :
  • :

కరుణానిధి … డిఎంకె అధ్యక్షుడిగా 50ఏళ్లు

Chennai : Karunanidhi steps into 50th year as DMK President

చెన్నయ్ : కరుణానిధి సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. సినీ ప్రస్థానంతో మొదలు పెట్టిన ఆయన ప్రయాణం రాజకీయాల వైపు సాగింది. రాజకీయంగా ఆయన ఎన్నో ఆట్లుపోట్లు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ డిఎంకెను సమర్ధవంతంగా నడిపించారు. డిఎంకె అధ్యక్షునిగా కరుణానిధి శుక్రవారంతో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ట్వీట్ చేశారు. ప్రజాజీవితంలో 80 ఏళ్లు, పార్టీ పత్రిక ఎడిటర్‌గా 75 ఏళ్లు పని చేసి రికార్డు సృష్టించారని స్టాలిన్ పేర్కొన్నారు. సినిమా రంగంలో 70 ఏళ్లు, అసెంబ్లీలో 60 ఏళ్లు పని చేసి అరుదైన గుర్తింపు పొందారని తెలిపారు. కరుణానిధి నేతృత్వంలో డిఎంకె అనేక విజయాలను సొంతం చేసుకుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు కరుణానిధి బాటలో సాగి ఆయన ఆశయాలను సాధించాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.

Karunanidhi steps into 50th year as DMK President

Comments

comments