Search
Friday 16 November 2018
  • :
  • :

కశ్మీర్ పాకిస్థాన్‌లో అంతర్భాగమే : నవాజ్ షరీఫ్

nawaz2

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కశ్మీర్ అంశంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ పార్లమెంటరీ సదస్సు ప్రారంభోత్సవానికి హాజరైన షరీఫ్ కశ్మీర్ పాకిస్థాన్‌లో అంతర్భాగమేనని పేర్కొన్నారు. అంతేకాక హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీని మరోసారి ప్రశంసించారు. వానీ శక్తివంతమైన, ప్రజాకర్షణ గల నాయకుడని ఆయన కీర్తించారు. కశ్మీరీ ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని అన్నారు. అమరుడైన వానీ కశ్మీరీ ఉద్యమానికి సరికొత్త మలుపు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. భద్రతా బలగాలు వానీని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ కశ్మీరీలు చేస్తున్న ఆందోళనలను భారత బలగాలు అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నందుకు చింతిస్తున్నామన్నారు. కశ్మీర్ ప్రజలు తమ హక్కుల కోసం చేసే పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు.

Comments

comments