Home తాజా వార్తలు కాంట్రాక్టర్లకు అందని ఈఎన్‌డిలు

కాంట్రాక్టర్లకు అందని ఈఎన్‌డిలు

Kasturba contractors does not get ENDs

 

సుబేదారి: 2015-16 కాలంలో కస్తూరిబా స్కూల్‌లలో కూరగాయలు పండ్లు, చికెన్, మటన్ ప్రొవిజన్స్‌లలో సప్లై చేసిన కాంట్రాక్టర్ల నుండి ముందస్తుగా ప్రభుత్వానికి చెల్లించిన ఈఎంపిలను దాదాపు రూ.లక్షకు సంబంధించిన ఈఎన్‌డిలు చెల్లించకుండా డిఇఒ, జిసిడిఒ ఫర్ కాంట్రాక్టర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాగా ఉన్నప్పుడు కొనసాగిన కాంట్రాక్టర్లను జిల్లాలు వేరైనా సందర్భంగా మీ ఫైలు మా దగ్గర లేదు. వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్నదని దానికి సంబంధించిన మీ ఫైలు మా వద్దకు రాలేదని వచ్చిన వెంటనే చెల్లిస్తామని ఐదు సంవత్సరాలుగా 10, 20 సార్లు కాంట్రాక్టర్ల లెటర్లు రాసినప్పటికి ఆ లెటర్లు అని చెత్తకుప్పల పాలే అవుతున్నాయి.

కాంట్రాక్టర్లు దిక్కుతోచని పరిస్థితిలో డిఈఒ కార్యాలయం ముందు బయట ఏంపు చేసి ఎన్నోసార్లు నిరసన తెలిపిన పట్టించుకున్న పాపాన లేదు. దీంతో అసహనానికి గురి అయిన ధర్మసాగర్ కస్తూరిబా కాంట్రాక్టర్ మంగళవారం జిసిడిఒ రమదేవిని ప్రశ్నించగా మాకు సంబంధం లేదు మీరు దిక్కున్న చోట చెప్పుకోండని ఇష్టం వచ్చిన రీతిగా సమాధానం చెప్పింది. దీంతో తీవ్ర మనస్తాపనికి గురైన ధర్మసాగర్ కస్తూరిబా కాంట్రాక్టర్ డిఈఒ కార్యాలయం ముందు అరగంట సేపు బయట నుండి వారి ఆవేదనను వెలిబుచ్చారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, నాయకులు స్పందించి రూ.లక్ష ఈఎన్‌డిలను కాంట్రాక్టర్లకు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిసి డిఒ, డిఇఒ స్పెషల్ ఆఫీసర్ల వారిని తీవ్ర ఇబ్బందులు చేసినందుకు మనస్తాపంతో త్వరలో ఆత్మహత్య చేసుకుంటానని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

Kasturba contractors does not get ENDs