Search
Friday 21 September 2018
  • :
  • :

‘కాటమరాయుడు’ టీజర్‌కు కోటి వ్యూస్!

Katamarayudu

బాహుబలి : ది బిగినింగ్ చిత్రం తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. మొత్తం ఇండియన్ సినిమాకే అది సవాలు విసిరింది. అన్ని రకాలుగా సరికొత్త రికార్డులకు తెరతీసింది. ‘బాహుబలి : ది కంక్లూజన్’ కూడా ఇప్పటిదాకా ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసి కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుందనడంలో సందేహం లేదు. అయితే ‘బాహుబలి’ వంటి స్పెషల్ మూవీని పక్కనపెట్టేసినా ఇతర తెలుగు సినిమాలు కూడా సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. బాలీవుడ్ సినిమాలకు మాత్రమే సాధ్యమైన రికార్డుల్ని సొంతం చేసుకుంటున్నాయి. గత నెలలో రిలీజైన పవన్‌కళ్యాణ్ ‘కాటమరాయుడు’ టీజర్ ఆరంభం నుంచి జోరు చూపిస్తోంది. ఇదివరకే టాలీవుడ్‌లో టీజర్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసిన ఈ చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది. కోటి వ్యూస్ తెచ్చుకున్న తొలి టీజర్‌గా ‘కాటమరాయుడు’ రికార్డు సృష్టించింది. రిలీజైన నెల రోజుల తర్వాత ఈ టీజర్ ఈ మైలురాయిని అందుకుంది. ఈ టీజర్ వచ్చిన రెండు వారాలకే ‘ఖైదీ నంబర్ 150’ టీజర్ పేరిట ఉన్న హయ్యస్ట్ వ్యూస్ రికార్డును బద్దలు కొట్టింది. ఆతర్వాత నెమ్మదిగా 10 మిలియన్ మార్క్‌వైపు అడుగులు వేసింది. ఈ టీజర్ లైకుల విషయంలోనూ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ టీజర్ వచ్చే సమయానికి లక్ష లైకులు కొట్టించుకున్న టీజర్ కూడా ఏదీ లేదు. అయితే ప్రస్తుతం ‘కాటమరాయుడు’ లైక్స్ 2.5 లక్షలకు పైగా ఉండటం విశేషం.

Comments

comments