Home తాజా వార్తలు యుపిలో పట్టాలు తప్పిన రైలు

యుపిలో పట్టాలు తప్పిన రైలు

Train-Derailed

లక్నో:  ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ ప్రాంతం డొమింగ్రా రైల్వే స్టేషన్ కు సమీపంలో గురువారం మధ్యాహ్నం కొత్తగూడెం – హౌరా  ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. నాలుగు కోచ్ లు పట్టాల తప్పి పక్కకు ఒరిగినట్టు సమాచారం. రైలు పట్టాలు తప్పడంలో ఆ రూట్ లో వచ్చే పలు రైళ్లను రద్దు చేశారు. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు గాయపడినట్టు సమాచారం. యుపిలోని రాయ్ బరేలీలో బుధవారం ఉదయం న్యూ ఫరఖా ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.  24 గంటలు గడవక ముందే రెండు రైళ్లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు రైల్వే వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  కాలం చెల్లిన పట్టాలు మార్పు చేయకపోవడంతో రైళ్లు పట్టాలు తప్పుతున్నాయని ప్రయాణికులు మండిపడుతున్నారు.

Kathgodam-Howrah Express Train Derailed in Gorakhpur

Telangana news