Home తాజా వార్తలు హోస్జూకు ముచ్చటగా మూడో స్వర్ణం

హోస్జూకు ముచ్చటగా మూడో స్వర్ణం

Katinka-Hosszuరియో డి జనీరో: హంగేరీ స్టార్ స్విమ్మర్ కటింకా హోస్జూ పసిడి పతకాల వేటను కొనసాగిస్తోంది. నాలుగోరోజు జరిగిన మహిళ స్విమ్మింగ్ వ్యక్తిగత 200 మెడ్లీ పోటీల్లో 2.06.58 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్‌లో హోస్జూకు ఇది మూడో పసిడి పతకం. దీంతో పతకాల పట్టికలో అత్యధిక స్వర్ణాలు సాధించిన మహిళా అథ్లెట్‌గా నిలిచింది.