Home సినిమా రణవీర్‌కు జోడీగా కత్రినా

రణవీర్‌కు జోడీగా కత్రినా

Katrina-Kaif

మల్లీశ్వరి సినిమాతో తెలుగులో మంచి హిట్‌ను అందుకున్న బాలీవుడ్ తార కత్రినాకైఫ్ ప్రస్తుతం హిందీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. అయితే గత కొంతకాలంగా ఆమెకు సరైన హిట్ దొరకక సతమతమవుతోంది. అయినా కూడా ఈ అమ్మడికి వరుసగా మంచి ఛాన్సులే వస్తున్నాయి. ఇప్పుడు మరో మంచి ఆఫర్ కత్రినాకు వచ్చిందని తెలిసింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి తెలుగు మూవీ ‘టెంపర్’ రీమేక్‌ను రణవీర్ సింగ్‌తో చేయబోతున్నాడు. ఇందులో కత్రినా కైఫ్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలనుకొని రోహిత్ శెట్టి ఆమెను సంప్రదించగా ఆమె వెంటనే ఒప్పుకుందట. ప్రస్తుతం ‘గోల్‌మాల్ రిటర్న్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆమె అది పూర్తికాగానే ‘టెంపర్’ రీమేక్‌లో నటిస్తుందట. సల్మాన్ ఖాన్ చిత్రం ‘టైగర్ జిందా హై’, అమీర్‌ఖాన్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’తో పాటు షారుక్ సినిమాలో కూడా నటిస్తోంది ఈ స్టార్ బ్యూటీ. అయితే ఇటీవల రణబీర్‌కపూర్‌తో చేసిన ‘జగ్గా జాసూస్’ ఫ్లాప్ అవడంతో నిరాశ చెందిన కత్రినా ప్రస్తుతం చేస్తున్న ఖాన్‌ల చిత్రాలతో పెద్ద విజయాలను తన ఖాతాలో వేసుకుంటానన్న ధీమాతో ఉంది కత్రినాకైఫ్.