Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోసం ప్రత్యేక బలగాలు

12adadb17pఆదిలాబాద్: ప్రజల భాగస్వామ్యంతో అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లు అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామ న్న తెలిపారు. బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో హౌజింగ్, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రక రణ్‌రెడ్డితో కలిసి జోగు రామన్న కవ్వాల్ టైగర్ రిజర్వ్ రీ-ఆర్గనై జేషన్ కార్యాచరణను సమీక్షిం చారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టునుఆదర్శంగా తీర్చిదిద్దేం దుకు ప్రత్యేక దృష్టిని సారి స్తున్నట్లు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో అడవులు, వన్యప్రాణుల సంరక్షణ సాధ్యమన్నారు.

ఏ కార్య క్రమమైనా, పథకమైనా విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని అభిప్రా యపడ్డారు. ప్రజలు మరింత చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బలగాలను పంపనుందని జోగు రామన్న తెలిపారు. తొలి విడతగా 120 మంది సుశిక్షితులను కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోసం బాధ్యతలను అప్పగించనుందన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోసం 892.23 చదరపు కిలో మీటర్ల కోర్ ఏరియా, 1123.21 చదరపు కిలో మిటర్ల బఫర్ ఏరియాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టైగర్ కన్జర్వేషన్, టైగర్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలను తయారు చేస్తున్నట్లు జోగు రామన్న పేర్కొన్నారు. కోర్ ప్రాంతంగా పిలిచే కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతం ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్ పరిధిలోకి వస్తుందని, బఫర్ ప్రాంతంగా పిలిచే పిరిధిలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆధీనంలో ఉంటుందన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ రీ-ఆర్గనైజేషన్ వల్ల ఉద్యోగుల సర్వీసుకు, పదోన్నతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి స్పష్టం చేశారు.
అటవీ సిబ్బంది ఇష్టం మేరకే డిప్యూటేషన్లు ఉంటాయన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, పిసిసిఎఫ్ ఎస్‌బిఎల్ మిశ్రా, వైల్డ్‌లైఫ్ చీఫ్ వార్డెన్ పికె. శర్మ, అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి మోహన్ చంద్ర పర్గేయిన్, సిఎఫ్. తిమ్మారెడ్డి, జూనియర్ ఫారెస్ట్ అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేందర్ సర్కిల్ ప్రతినిధి అరుణ్‌కుమార్, జోనల్ కార్యదర్శి కొండ్ర బాలయ్య, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ జిల్లా అధ్యక్షుడు చెట్ల శ్రీనివాస్, కోశాధికారి ఖాజా హిదాయత్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments