Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

పేదల అభివృద్ధే కెసిఆర్ లక్షం

KCR aimed at poor development

మన తెలంగాణ/నెల్లికుదురు : బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్షంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు సాగుతున్నాడని మహబాద్ శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ముస్లిం సోదరులకు దుస్తుల పంపిణీ, బడిబాట కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేర్వేరు సమావేశాలలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమ లు చేస్తున్నదని ఆయన అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్షంగా దసరాకు బతుకమ్మ చీరలు, రంజాన్‌కు ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ, క్రిస్‌మస్‌కు క్రిష్టియన్‌లకు దుస్తులు పంపిణీ చేసిన ఘనత దేశంలో ఒక్క మన ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పాఠశాలలో మెరుగైన సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం విద్యకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని, విద్యార్థులకు గురుకులాలు, ఉచిత సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం, ఉచిత దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిస్తూ కార్పోరేట్ విద్యా సంస్థలకు దీటుగా విద్య ను అందిస్తుందని, గ్రామాలలో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి బంగారు భవిష్యత్తును అందించాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సర్పం చ్ కస్తూరి శ్రీనువాస్, ఎఎంసి వైస్ చైర్మన్ యాలాద్రి, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ యాదగిరిరెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఎన్నాకుల శ్రీనువాస్, మండల పార్టీ అధ్యక్షుడు బిక్కూ నాయక్, మండల ప్రత్యేక అధికారి ప్రవీన్, తహశీల్దారు వేణుగోపాల్, ఎంపిడిఒ వేణుగోపాల్‌రెడ్డి, వ్యవసాయ అధికారి రవీందర్‌రెడ్డి, నాయకులు వెంకటరెడ్డి, నాగరాజు, బోజ్యా, శంకర్ నాయక్, శ్రీనువాస్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments