Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కెసిఆర్ దంపతులకు శృంగేరి పీఠాధిపతి ఆశీస్సులు

srungeri-yaagamహైదరాబాద్ : దేశంలో ఎవరూ తలపెట్టని విధంగా అయుత చండీయాగం మహత్కార్యాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రయత్నం విజయవంతం కావాలని శృంగేరి పీఠా ధిపతి భారతీ తీర్థస్వామి ఆశీర్వదించారు. ఎర్రవెల్లిలో అయుత చండీ యాగం నిర్వహిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు స్వామి ఆశీర్వాదం తీసుకునేందుకు బుధవారం కర్ణాటకలోని శృంగేరి మఠాన్ని సందర్శించారు. మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లిలోగల తన వ్యవ సాయ క్షేత్రంలో అయుత చండీయాగాన్ని లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్వామికి వివరించారు. యాగానికి ముందు ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఇక్కడకు వచ్చినట్లు స్వామికి విన్నవించారు. అయుత చండీయాగం ఆహ్వాన పత్రిక, పట్టు వస్త్రాలు స్వామికి ముఖ్యమంత్రి దంపతులు అందజేశారు. యాగం నిర్విఘ్నంగా, ప్రశాంతంగా, విజయవంతంగా జరగాలని స్వామి ఆకాంక్షించారు. ఈ యాగం ఫలం వల్ల తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారని ఆశీర్వదించారు. యాగంలో పాల్గొనే రుత్వికులు అంకితభావం, చిత్తశుద్ధితో కర్తవ్యాన్ని నిర్వహించాలని భారతీ తీర్థస్వామి సూచించారు. ముఖ్యమంత్రి దంప తులకు ఫల పుష్పాలు, నూతన వస్త్రాలు బహూకరించి ఆశీర్వదించారు.
సాంప్రదాయ స్వాగతం: ప్రత్యేక హెలీకాఫ్టర్‌తో బుధవారం మధ్యాహ్నం శృంగేరి పీఠం చేరుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులకు ఆలయ సంప్రదాయం ప్రకారం మఠం సిఇఒ గౌరీ శంకర్ స్వాగతం పలికారు. స్వామి ఆశీర్వాదం తరువాత ముఖ్యమంత్రి దంపతులు శారదా దేవీ, ఆది శంకరాచార్య, శక్తి గణపతి, తోరణ గణపతి దేవాలయాలను సంద ర్శించారు. శృంగేరి మఠం విశిష్ఠత, ప్రాముఖ్యత, సామాజిక సేవా కార్య క్రమాలను మఠం ధర్మకర్తలు వివరించారు. భావి పీఠాధిపతి విధు శేఖర భారతీ తీర్థ, పేష్కార్ శివశంకర్ భట్, మఠం అధికారులు పాల్గొన్నారు.

Comments

comments