Search
Sunday 18 November 2018
  • :
  • :

శ్రీరాముడిగా కెసిఆర్

KCR as Sri Rama in Cutout

రంగారెడ్డి : ఆదివారం సాయంత్రం జరిగే టిఆర్‌ఎస్ ప్రగతి నివేదన సభ కోసం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ ముస్తాబైంది. సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సిఎం, టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ అభిమాని కెసిఆర్ కటౌట్‌ను శ్రీరాముడి రూపంలో ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌లో కెసిఆర్‌తో పాటు మంత్రులు కెటిఆర్, మహేందర్‌రెడ్డి తదితర ఫొటోలను ప్రదర్శించారు. ప్రగతి నివేదన సభకు తరలి రావాలంటూ ఆ కటౌట్‌లో ప్రజలను టిఆర్‌ఎస్ నేత తేరుపల్లి రమేష్ కోరారు.

KCR as Sri Rama in Cutout

Comments

comments