Home తాజా వార్తలు విద్యకు అధిక ప్రాధాన్యం: ఎర్రబెల్లి

విద్యకు అధిక ప్రాధాన్యం: ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao

 

జనగామ: ఐదేళ్లలో 119 బిసి గురుకులాలను ప్రారంభించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ బిసి గురుకుల పాఠశాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంఎల్‌ఎ నన్నపునేని నరేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించాలన్నది సిఎం కెసిఆర్ ఉద్దేశ్యమని చెప్పారు. గురుకులాలనే కెజి నుంచి పిజి వరకు మారుస్తామని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక బిసి గురుకుల పాఠశాల కేటాయించామని, కార్పొరేట్ విద్యకు ధీటుగా గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యను పూర్తిగా భ్రష్టు పట్టించారని, విద్యకు సిఎం కెసిఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకొచ్చారు.

 

KCR Concentration on KG to PG : Errabelli Dayakar Rao