Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదాలపై కెసిఆర్ దిగ్భ్రాంతి

Reschedule loans in three districts

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మూడు రోడ్డు ప్రమాదాలపై సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలో ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు రైతులు మృతి చెందారు. వరంగల్ జిల్లాలో కాలువ బ్రిడ్జిని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ వద్ద కారు- లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆదివారం ఉదయం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వేములకొండ వద్ద ట్రాక్టర్ బోల్తా పడి 15 మంది కూలీలు చనిపోయిన విషయం తెలిసిందే.

Comments

comments