Search
Monday 12 November 2018
  • :
  • :
Latest News

హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన సిఎం కెసిఆర్

Kcr Condolence to Harikrishna Dead Body
హైదరాబాద్: టిడిపి సీనియర్ నేత నందమూరి హరికృష్ణ పార్థివదేహానికి తెలంగాణ సిఎం కెసిఆర్ నివాళులర్పించారు. మెహిదీపట్నంలో ఉన్న నివాసంలో హరిక‌‌ృష్ణ భౌతికకాయాన్ని కెసిఆర్ సందర్శించారు. నందమూరి కుటుంబసభ్యును పరామర్శించిన కెసిఆర్, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కెసిఆర్ వెంట డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. ఇదిలా ఉండగా, హరికృష్ణ నివాసం దగ్గరికి ఆయన అభిమానులు, టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పాటు, ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది.
అదేవిధంగా హరికృష్ణకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నివాళులు అర్పించారు. హరికృష్ణ అందరితో కలివిడిగా ఉండేవారని ఆయన పేర్కొన్నారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు గవర్నర్ నరసింహన్ సానుభూతి తెలిపారు. మంత్రి తలసాని కూడా హరికృష్ణకు నివాళులు అర్పించారు.

Comments

comments