Home మహబూబాబాద్ బంగారు తెలంగాణ పేర కుటుంబ పాలన

బంగారు తెలంగాణ పేర కుటుంబ పాలన

పాదయాత్ర సభలో తమ్మినేని వీరభద్రం

Veerabhadram1

గార్ల: తెలంగాణ రాష్టాన్ని బంగారు తెలంగాణ మారుస్తానని గొప్పలు చేపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం కుటుంబ పాలనగా సాగుతు ప్రజా సంక్షేమం వదిలేసి కమిషన్లతో పనులు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలో ఆరోపించారు. సామాజిక న్యాయం తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్షంతో మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టిన తమ్మినేని వీరభద్రం గురువారం నాడు గార్ల మండల కేంద్రంకు చేరుకోవడం జరిగింది. తొలుత బుద్ధారం క్రాస్‌రోడ్డులో గల సిపియం సీనియర్ నాయకులు తాళ్ళురి నర్సయ్య స్ధారక స్థూపం సమీపంలో  పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది.

అనంతరం గ్రామంలో పాదయాత్ర నిర్వహించి స్ధానిక నెహ్రూ సెంటర్‌లో ఏర్పటు చేసిన సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బడుగు జీవుల అభ్యున్నతే ధ్యేయంగా సాగుతున్న చారిత్రాత్మక మహాజన పాదయాత్రకు ప్రతి ఒక్కరు మద్దతునివ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో వస్తే రాష్ట్రంలో నిధులు నీళ్ళు ఉద్యోగాలు వస్తా యని అనేక మంది విద్యార్ధులు ప్రాణాత్యాగాలు చేసి స్వారాష్టం కోసం వీరోచి తంగా పోరాటం సాగించడం జరిగిందన్నారు. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అధికార దాహంతో అచరణ సాధ్యం కాని హామిలు గుప్పించి అధికారం చేపట్టిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా పేదల బతుకులతో చెలగా టం అడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మొండి చెయ్యి చూపుతు కెసిఆర్ ప్రభుత్వం కుటుంబంలో అందరికి ఉద్యోగాలు కల్పించుకోని రాష్ట్ర అర్ధిక వ్యవస్ధను విచ్చన్నం చేస్తు కుటుంబ పాలన సాగిస్తున్నరని ఆరోపించారు.

చేసిన వాగ్ధానాలు అత్య ధికంగా అచరణకు నోచుకోక పోగా రాష్ట్ర జనాభాలో 93శాతం ఉన్న ఎస్‌సి ఎస్‌టి బిసి ఎంబిసి మైనార్టి తరగతులు అభివృద్ధి కాకుండా రాష్ట్ర బంగారు తెలంగాణ వైపు ఎలా వెలుతుందని తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కెసిఆర్ ప్రభుత్వంలో కుటుంబానికి న్యాయం జరిగినంతా మాత్రాన రాష్ట్రంలో నిరుద్యోగం ఉపాధి పారిశ్రామిక సాగునీటి రంగాల అభివృద్ధిలో సామాజిన స్యాయం చూపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉపాధి విద్యా వైద్య రంగాల్లో కార్పొరేట్ శక్తులకు ప్రయివేటికరణతో సామాజిక తరగతులకు విద్యా వైద్యం అదుబాటులో లేకుండా పోతుందని తద్వారా గ్రామాల్లో చేతి వృత్తులు దెబ్బతిని పేద ప్రజలు బతుకులు భారమైయి పట్టణ ప్రాంతాలకు వలసులు పోతున్నారని తెలిపారు. ఎర్రవల్లి గ్రామంలో పేదలకు డబుల్ బెడ్‌రూంలు నిర్మించిన కెసిఆర్ ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలు గుర్తుకు రావడంలేదాని ఆయన ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలకు కాపలా దారుడిగా ఉంటు రాష్ట్రం లో దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన మాటలు దళితులకు మూడు ఎక రాల భూమి హామిలు నీటిమూటలుగా మిగిలి పోయాయని ఆరోపించారు.

పాదయాత్ర ద్వారా ప్రజల విన్నపాలు ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి సమస్యల పరిష్కారం కోసం సిపియం పార్టీ ప్రజా ఉధ్యమాలు నిర్మిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజా ఉధ్యమాలు అణిచివేసిన గత ప్రభుత్వాలకు పట్టిన గతే రాబోయో రోజుల్లో కెసిఆర్ ప్రభుత్వానికి పడుతుందని తమ్మినేని జోస్యం చెప్పారు. స్ధానిక రైల్వేయి గేటు నుండి ప్రారంభమైన మహాజన పాదయాద్రకు సంఘిభావం సిపిఐ జిల్లా నాయకులు కట్టెబోయిన శ్రీనివాస్ మండల కార్యదర్శి జంపాల వెంకన్న కాంగ్రెస్ జిల్లా నాయకులు జర్పుల భీముడు నాయక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పానుగంటి రాధకృష్ణ టిడిపి నాయకులు ఎలమరెడ్డి కిష్టారెడ్డి కొండల్‌రావు పర్చురి సుజ్ఞానా ప్రసాద్ వైసిపి నాయకులు బాపన పల్లి సుందర్, సక్రు నాయక్,హరినాయక్ తమ్మినేని వీరభద్రంకు పూలమాల వేసి సంఘీభావం తెలపడం జరిగింది.

వేలాది మంది కార్యకర్తలు డప్పు వాయుద్యాల నడుమ మహాజన పాదయాత్ర సారధి తమ్మినేని వీరభద్రాన్ని గ్రామంలోకి స్వాగతం పలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసన సభ్యులు సున్నం రాజయ్య, సిపియం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్‌రావు ,బి.వెంకట్, జి.నాగయ్య, పాలడుగు భాస్కర్,వంగూరి రాములు సిపియం మహబుబాబాద్ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్,ఇల్లెందు డివిజన్ నాయకులు మేరుగు సత్యనారయణ, యాకయ్య, సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్, గిరిప్రసాద్, ఈశ్వర్‌లింగం,ఐద్వా రాష్ట్ర కార్యదర్శి బత్తుల హైమవతి,జిల్లా అధ్యక్షులు కందునూరి కవిత,నాయకులు వంగురి పెద్ద వెంకటేశ్వర్లు,గోవిందు గోపాలపురం సర్పంచ్ ఎంపిటిసి భూక్యా బుజ్జి,వంగూరి పద్మ వివిధ ప్రజా సంఘాల భాధ్యులు తదితరులు పాల్గొన్నారు.