Home తాజా వార్తలు నామినేషన్ దాఖలు చేసిన కెసిఆర్

నామినేషన్ దాఖలు చేసిన కెసిఆర్

KCR-Nominations

సిద్దిపేట: గజ్వేల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆపధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 2.34 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్ ఆర్డిఒ కార్యాలయంలో  కెసిఆర్ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కొంత మంది అనుచరులతో కలిసి వచ్చిన సిఎం తన నామినేషన్‌ను అధికారికి సమర్పించారు. అంతకు ముందు కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో కెసిఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం హరీష్ రావుతో కలిసి ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించిన విషయం విధితమే.

KCR Filled Nomination in Gajwel

Telangana news