Search
Friday 21 September 2018
  • :
  • :

కెసిఆర్‌ది అహంకార ధోరణి

రాష్ట్ర ప్రభుత్వానిది రైతాంగ వ్యతిరేక ధోరణి
అప్పుడు దొంగలు ఇప్పుడేమయ్యారు
మూడు నుంచి ప్రచార కార్యక్రమాలు
విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం

CPIఖమ్మం ప్రతినిధి:  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అహంకార ధోరణి అని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు ఆరోపించారు. నియంత పాలన సాగుతుం దని పోరాటాల ద్వారా సాధించుకున్న అనేక హక్కులను ఊడబికుతున్నారని ఆయన
తెలిపారు. శనివారం నగరంలోని గిరిప్రసాద్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో హేమంతరావు మాట్లాడుతూ భూ నిర్వాసితు లకు అనుకూలంగా జేఏసి చేపట్టిన ఆందోళ నకు అనుమతి ఇవ్వకపోవడమే గాక అరెస్టులు చేయడం, అనేక ప్రజా ఉద్యమాలను అణచివేసే ధోరణిని ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో కమ్యూనిస్టులను పొగిడిన నోటితోనే ఇప్పుడు కేసీఆర్ అనవసర విమ ర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ తన భాష తీరు మార్చుకోవాలని లేకపోతే గత పాలకులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

అనేక పోరాటాల ద్వారా కేంద్రంలో భూ సేకరణ చట్టాన్ని సాధించుకుంటే దానిని కాదని భూమిని లాక్కోనే విధంగా రాష్ట్రంలో చట్టం చేయడం ప్రజా వ్యతిరేక చర్యని హేమం తరావు తెలిపారు. 2013 భూ సేకరణ చటా్టన్ని అమలు చేయాలని ఆ చట్టంలో సామాజిక భద్రత సహా పలు అంశాలు దాగి ఉన్నాయని అది అమలు చేయకుండా రాష్ట్రం లో చట్టం చేయడం రైతాంగ వ్యతిరేక చర్య అన్నారు. మాఫియా డాన్ నయీం కేసులో ఓ పెద్దపెద్ద పోలీస్ అధికారులు, ప్రజా ప్రతి నిధులు, రాజకీయ ప్రముఖులు ఉన్నార న్నా రు.

ఎవర్నీ వదిలి పెట్టేది లేదని చెప్పిన ప్రభు త్వం ఇప్పుడు ఎవరూ లేరని చెప్పడం వెనుక అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎమ్మె ల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో ఎవరికి సంబం ధం లేదని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ ధాఖలు చేయడం ద్వారా నేరస్తులకు మద్దతు అన్న విషయం వెల్లడైందన్నారు. ఇప్పటికైనా నయీం కేసును సిబిఐకి అప్పగించాలని హేమంతరావు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కల్తీ కేంద్రంగా మారుతుందని పాలు మొదలు విత్తనాలు, కారం మొదలైనవి కల్తీకి ఇక్కడే అంకురార్పణ జరిగిందని ఆయన తెలిపారు. కల్తీ కారం కేసులో పీడి యాక్టు పెడుతున్నామన్న ప్రభుత్వం ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు.

అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కల్తీ కారం కేసులో ఉన్నా రని వారిని అరెస్టు చేయాలని హేమంతరావు డిమాండ్ చేశారు. నోట్ల రద్దు వలన సామా న్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. నోట్ల రద్దు వెనుక ఆర్థిక కుంభకోణం దాగిఉందన్నారు. నోట్ల రద్దులో జరిగిన లోటుపాట్ల ను వివరిస్తూ జనవరి మూడు నుంచి 9వ తేదీ వరకు గ్రామ గ్రామా న సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు హేమంతరావు తెలిపారు. విలేకరుల సమా వేశంలో సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు పోటు ప్రసాద్, జమ్ముల జితెం దర్‌రెడ్డి, బిజి క్లెమెంట్, మహ్మద్ సలాం, తాటి వెంకటేశ్వర్లు, సిద్దినేని కర్ణకుమార్ పాల్గొన్నారు.

Comments

comments