Home తాజా వార్తలు చింతమడకలో ఓటేయనున్న కెసిఆర్

చింతమడకలో ఓటేయనున్న కెసిఆర్

 

సిద్దిపేట:తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్భంగా రేపు(శుక్రవారం)ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి  కెసిఆర్, మంత్రి హరీష్ రావు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామములో బూత్ నంబర్ 13లో సిఎం కెసిఆర్ కు ఓటు ఉండటంతో రేపు సతీ సమేతంగా అక్కడ ఓటు వేయనున్నారు.

కెసిఆర్ ఓటు వేసే పోలింగ్ బూత్ ను, హెలిప్యాడ్ స్థలాలను పోలీసు కమిషనర్ జోయెల్ డేవిస్ ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా  చింతమడకలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక, సిద్దిపేట పట్టణం బూత్ నంబర్ 107 అంబిటస్ స్కూల్లో హరీష్ రావు సతీ సమేతంగా ఓటు వేయనున్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

 

kcr his vote cast in chintamadaka village