Search
Sunday 18 November 2018
  • :
  • :

విద్య, వైద్య రంగాలకు పెద్దపీట : లక్ష్మారెడ్డి

minister-laxma-reddy

మహబూబ్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వ్యాఖ్యనించారు. ‘కెజి టు పిజి’ ఉతిత విద్యని ప్రజలందరికీ అందించాలన్నదే సిఎం కెసిఆర్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. జిల్లాలోని అడ్డాకుల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మంత్రి అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంచి సమాజం ఏర్పాటు చేయాలన్నదే కెసిఆర్ ఆలోచనని అందుకు విద్యనే ఉత్తమ సాధనమని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను ఆధునీకరించామని పేర్కొన్నారు. అంతే కాకుండా కొత్తగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని చెప్పారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఎనిమిది లక్షల మంది ఆడ పిల్లలకు అవసరమైన శానిటరీ కిట్స్ అందిస్తున్నట్టు తెలియాజేశారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలు మెరుగు ఫలితాలు రాబడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులు చక్కగా చదివి భావి భారత పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమానికి దేవరకధ్ర ఎంఎల్ఎ ఆల వెంకటేశ్వరరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండారు భాస్కర్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ పర్యటనలో భాగంగానే రూ. 45 లక్షలతో నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయ నూతన భవనాన్ని లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

Comments

comments