Search
Saturday 21 July 2018
  • :
  • :

సిబ్బంది సంఘాల కుదింపు?

kcr

ప్రభుత్వోద్యోగుల యూనియన్ల సంఖ్యను పరిమితం చేసే యోచన
క్రమబద్ధీకరించాలని సిఎస్‌కు సిఎం ఆదేశం
ఎక్కువ సంఘాలతో పని దెబ్బతింటోందని అభిప్రాయం

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీ ప్రక్రియ పూర్తయిపోయినప్పటికీ సంఘాల సంఖ్య పెరిగిపోతుండడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో దాదాపు వంద ఉద్యోగ సం ఘాలు ఏర్పడ్డాయని, ఉద్యోగుల సంక్షేమం కోసం ఇన్ని సంఘాలు అవసరమా అని వ్యాఖ్యానించిన కెసిఆర్ చాలా సందర్భాల్లో సంఘాల నాయకులు పైరవీల కోసం, ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల కోసం, స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని, ఈ సంఘాలను క్రమబద్ధీకరించాలని ఇటీవ ల ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు తెలిసింది. సంఘాల నాయకులుగా చెలామణి అవుతూ పలు సందర్భాల్లో ‘ఒడి’ సౌకర్యాన్ని పొందుతున్నారని, ప్రభుత్వం నుంచి కొన్ని మినహాయింపులు, ప్రత్యే క సౌకర్యాలను పొందుతున్నారని, ఈ కారణంగా రోజువారీ పనులకు ఆటంకం ఏర్పడుతోందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, ఫోర్త్‌క్లాస్, డ్రైవర్… ఇలా ఆరేడు సంఘాలు ఉంటే సరిపోతుందని, వాటికి మాత్రమే ప్రభుత్వ గుర్తింపు ఇవ్వడంపై కసరత్తు చేయాల్సిందిగా సి ఎస్‌కు సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఎన్ని సంఘాలు ఉన్నాయి, వాటి వలన ఆ సంఘాల్లోని ఉద్యోగులకు అందుతున్న సంక్షేమ సౌకర్యాలేం టి, ఒక సంఘంలో సభ్యులుగా ఉన్నవారు మరో సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి సందర్భాలేంటి, ఏకకాలంలో ఒకటికంటే ఎక్కువ సంఘా ల్లో ఉండడం ద్వారా ఆ ఉద్యోగులకు అదనంగా అందుతున్నదేంటి.. ఇలా అనేక అంశాలపై సిఎస్ ఆరా తీస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు గా చెలామణి అవుతున్న వారు విధి నిర్వహణ కోసం వెచ్చిస్తున్న సమయం, సంఘం కార్యకలాపాల కోసం వెచ్చిస్తున్న సమయం, అదనంగా పొందుతున్న ఒడి వంటి రాయితీలు, ప్రత్యేక సౌకర్యాలు తదితరాలపై కూడా వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను కుదించి వారిని క్రమబద్ధీకరించడం ద్వారా వచ్చే ప్రయోజనాలు, వాటికి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వడం తదితరాలపై కొద్దిమందితో చర్చించినట్లు సమాచారం. ‘ఉద్యోగ సంఘాల నాయకులు’ అనే పేరుతో చేస్తు న్న పైరవీలు, ఇతర అవసరాల కోసం ఈ హోదా ను వాడుకోవడం తదితరాలపై కూడా ఆరా తీస్తున్నారు. సంఘాల ద్వారా ఉద్యోగులకు సంక్షేమ సేవలందిస్తున్నారా లేక స్వప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారా అనే అంశాలపై సిఎస్ ప్రధాన దృష్టి పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఆరేడు సంఘాల పరిధిలోకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఇవ్వడం ద్వారా విధుల నిర్వహణకు తలెత్తుతున్న ఆటంకాలను చక్కదిద్దడంతో పాటు పైరవీలు, అజమాయిషీ, ప్రత్యేక సౌకర్యాలు లాంటివాటిని కత్తిరించవచ్చని సిఎం భావిస్తున్నట్లు సమాచారం. సిఎం కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించిన సిఎస్ త్వరలోనే ప్రాథమిక నివేదికను అందజేయనున్నారు.

Comments

comments