Home తాజా వార్తలు కెసిఆర్ కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తున్నారు : రాహుల్ గాంధీ

కెసిఆర్ కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తున్నారు : రాహుల్ గాంధీ

Rahul-Gandhi

సంగారెడ్డి : సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన సభలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తు కెసిఆర్, ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘తెలంగాణ ప్రజల కలలు సాకారం అయ్యాయా?. మూడేళ్లలో తెలంగాణ అభివృద్ధి చెందిందా?. తెలంగాణ ప్రజలు నలుగురి కోసమే పోరాడారా?. సిఎం కెసిఆర్‌ ఎవరి కోసం పని చేస్తున్నారు?. కేవలం కాంట్రాక్టర్ల హితం కోసమే పని చేస్తున్నారు?.’ అని ప్రశ్నలు సంధించారు.

తెలంగాణ శక్తి, వనరులు ఒకే కుటుంబంలో బందీ అయ్యాయని, అందరి అధికారాలు లాక్కొన్ని ఒకే కుటుంబం అధికారం చెలాయిస్తుందని అన్నారు. తెలంగాణలో బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. గత మూడు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా 2855 మంది రైతులు ఆత్యహత్యలు చేసుకుంటే.. అందులో 100 మంది సిఎం నియోజకవర్గానికి చెందిన వారేనని అన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రూ.75 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేస్తే వారి పాస్ బుక్ లు, మహిళల బంగారం ఇంకా బ్యాంకుల్లోనే ఎందులకు ఉన్నాయని అన్నారు.