Home తాజా వార్తలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రండి…

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రండి…

CM KCRముంబయి : మహారాష్ట్రలో తెలంగాణ సిఎం కెసిఆర్ పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా కెసిఆర్ మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్ విద్యాసాగర్ రావుకు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాతో సత్కరించారు. ఈనెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతకల పథకం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆయన విద్యాసాగర్ రావును ఆహ్వానించారు. అనంతరం  కెసిఆర్ మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తప్పకుండా రావాలని కెసిఆర్ ఫడ్నవీస్ ను కోరారు.

KCR Meets Maharashtra Governor Vidyasagar Rao