Home తాజా వార్తలు కెసిఆర్ మళ్లీ సిఎం కావాలని నాలుక కోసుకొని హుండీలో…

కెసిఆర్ మళ్లీ సిఎం కావాలని నాలుక కోసుకొని హుండీలో…

KCR needs CM to pursue welfare schemes in Telangana

 

మన తెలంగాణ/సోమాజిగూడ: తెలంగాణలో సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు మరోమారు కూడా తెలంగాణకు ముఖ్యమంత్రిగా కెసిఆర్  కావాలని ఆల్ ఇండియా హ్యాండ్‌లూమ్ బోర్డ్ లో సభ్యుడిగా కొనసాగుతున్న చేవేళ్ల మహేష్ అనే వ్యక్తి(32) బుధవారం శ్రీనగర్ కాలనీలోని వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో స్వామివారికి తన నాలుక కోసి కానుకగా సమర్పించారు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ , తూర్పు గోదావరి జిల్లా, పోలవరానికి చెందిన మహేష్‌గా తెలిపారు. ఇతను 2004, 2009 వ సంవత్సరాలలో కుడా సమైక్యాంధ్రాలో ముఖ్యమంత్రిగా వైఎస్. రాజశేఖర్ రెడ్డినే గెలావాలని కోరుకుని తన నాలుక కోసుకుని ఇదే ఆలయంలోని హుండిలో సమర్పించినట్లు తాను రాసిన లేఖలో పేర్కొన్నాడు. దేవుని అనుగ్రహంతో రెండు సార్లు కూడా తన కోరిక నేరవేరి వైఎస్‌ఆర్‌ఎ ముఖ్యమంత్రిగా గెలిచి అనేక సంక్షేమ పథకాలను కొనసాగించారని తెలిపారు.

తెలంగాణలో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతు బంధు ,మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కంటి వెలుగు, కెసిఆర్ కిట్లు, వృద్ధాప్య పించన్లు, డబుల్ బెడ్ రూం వంటి సంక్షేమ పథకాలు ఆగిపోకుండా ఉండాలంటే మళ్ళీ కేసీఆర్‌నే సీఎంగా ఎన్నిక కావాలని, అపుడే ఈ సంక్షేమ పథకాలు కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని మహేష్ తన లేటర్‌లో రాసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మహాకుటమితో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదని , ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క దానిని కూడా నెరవేర్చలేక పోయాడని ఆయన తన లేఖలో పేర్కొనట్లు తెలిపారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరగనున్న ఎన్నికల్లో సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలకు అందాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. తాను కేసీఆర్ అభిమానిని కాదని , కేవలం ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై ఈ మొక్కును సమర్పించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని రక్తస్రావం అయిన మహేష్‌ను స్థానికంగా ఉన్న తన్విర్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.

KCR needs CM to pursue welfare schemes in Telangana

Telanagana Latest News