Home Default శారదా పీఠాధిపతులకు సిఎం కెసిఆర్ పుష్పాభిషేకం

శారదా పీఠాధిపతులకు సిఎం కెసిఆర్ పుష్పాభిషేకం

 

Swaroopananda Swamy

 

హైదరాబాద్: విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వాములకు మండళధ్వానాలు, వేదనాదాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వరూపానందేంద, స్వాత్వానందేంద్ర, సిఎం కెసిఆర్ లు జ్వోతి ప్రజ్వలనం చేశారు. ఈ కార్యక్రమంలో స్వీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు. ఆదిశంకరాచార్యుల చిత్ర పటానికి పూజలు నిర్వహించారు. సిఎం కెసిఆర్ స్వరూపానందేంద, స్వాత్వానందేంద్రతకు నూతన వస్త్రాలు సమర్పించి, పుష్పమాలతో సత్కరించారు. తెలంగాణ హరితహారానికి ప్రతీకగా తులసి మాలలు సమర్పించారు.

హైదరాబాద్ లో శారదా పీఠానికి కేటాయించిన 2 ఎకరాల భూమికి సంబంధించి పత్రాలు స్వరూపానంందేంద్రకు సిఎం అందజేశారు. స్వరూపానందేంద్ర స్వామి ఆదేశాల మేరకు దేశం నలుమాలలా పర్యటించి శంకర అద్వైతాన్ని ప్రచారం చేస్తామని స్వాత్మానందేంద్ర స్వామి తెలిపారు.  ధర్మప్రచారాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభిస్తాన్నాని, సిఎం కెసిఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం  సంతోషకరామని విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు. విశాఖ పీఠానికి హైదరాబాద్ లో స్థలం కేటాయించడం చాలా గొప్ప విషయామని స్వరూపానందేంద్ర స్వామి ప్రశంసించారు.

KCR Performs Pushpabhishekam To Sarada Peetam Seers