Home తాజా వార్తలు చంద్రబాబుకు వర్మ రిటర్న్ గిఫ్ట్

చంద్రబాబుకు వర్మ రిటర్న్ గిఫ్ట్

KCR return gift to Chandrababu Naidu

 

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రజల పక్షాన ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్‌గా సిఎం కెసిఆర్ చేతులమీదుగా జగన్‌ఫోటోను ఇస్తున్నట్లు చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కూటమితో కలిసి తెలంగాణలో ఎన్నికలప్రచారంచేసి ఘోర పరాభవం చెందిన టిడిపి నేత చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. అయితే అప్పటినుంచి రిటన్‌గిప్ట్ ఎలా ఉండబోతుందోనని రాజకీయ పార్టీల్లో, ప్రజల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణను మొదటినుంచి వ్యతిరేకించిన చంద్రబాబు శాసన సభ ఎన్నికల్లోనూకూడా కాంగ్రెస్‌తో కలిసి తెలంగాణలో అడ్డా వేయాలని ప్రయత్నించి పరాభవం పొందారు.

అయితే చంద్రబాబుకు ఈ సందర్భంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని సిఎం కెసిఆర్ ప్రకటించారు. అయితే గిప్ట్ ఏరూపంలో ఉంటుందోనని ఎదిరిచూస్తున్న ప్రజలకు వర్మ కెసిఆర్ పక్షాన ఇచ్చిన గిప్ట్ టిడిపి వర్గాలకు దిమ్మదిరిగిపోయింది. వర్మ ట్వీట్‌లో పోస్టు చేసిన ఫోటోలో జగన్ చిత్రపటాన్ని కెసిఆర్ తన స్వహస్తాలతో చంద్రబాబుకు అందిస్తున్నట్టుగా ఉంది. ఆ ఫోటోపై రిటర్న్ గిప్ట్ అని రాసి ఉండటంతో వర్మ ఉద్ధేశం ఎమిటో ఎవరిని విమర్శించడానికి ఈ ట్వీట్ చేశారో సులభంగా అర్థమవుతుంది. బహుష సిఎం కెసిఆర్ ఇవ్వాలనుకున్న రిటర్న్ గిప్ట్ దర్శకుడు వర్మ కెసిఆర్ పక్షాన ముందుగానే ఇచ్చినట్లయింది.

KCR return gift to Chandrababu Naidu