Home మెదక్ ఇది మాటల గారడీ ప్రభుత్వం : జగ్గారెడ్డి

ఇది మాటల గారడీ ప్రభుత్వం : జగ్గారెడ్డి

JAGGAREDDY

మన తెలంగాణ/కొండాపూర్ : రైతుల పక్షపాతి అని చెప్పుకునె సిఎం కెసిఆర్ రైతులకు ఎన్నికల సమయంలో మానిఫెస్టోలో రైతు రుణమాఫీ, సబ్సీడీ అందిస్తామని మాటలు చెప్పినా కెసిఆర్ దపాలుగా రుణమాఫీ చేయడం వ్యవసాయ రైతులను మోసగించడమే అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కొండాపూర్ మండల పరిధిలోని గంగారం గ్రామ శివారులో గల క్రిష్టల్ గార్డెన్‌లో సోమవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక దళితుడిని ముఖ్యమంత్రిని చెస్తానని, వ్యవసాయ రైతులకు రుణమాఫీ, సబ్సీడీలపై వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, పంట నష్టపోయిన వారికి తక్షణ అర్థిక సహయం అందిస్తామన్న కెసీఆర్ గారడీ మాటలు అని టిజెఆర్ అన్నారు. పెద్దలకు డబుల్ బెడ్‌రూం అని చెప్పి తనకు వందల కోట్లు వెచ్చించి తాను మాత్రం ప్రగతి భవన్ ఏర్పచుకున్నారని అన్నారు. ఇప్పటికైన రైతులకు తక్షణం పంట నష్టపోయిన వారికి అర్థికసాయం అందించాల న్నారు. వ్యవసాయ రూణమాఫీ ఒకేసారి అందించాలని పేర్కొన్నారు. వై.ప్రభు, నర్సింహారెడ్డి, రామక్రిష్ణరెడ్డి, నగేష్ ,కిషన్ ,రాజేంద్రప్రసాద్, నర్సింలు, మల్లారెడ్డి, సదాశివగౌడ్, నజీరోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.