Home మంచిర్యాల మాయమాటలతో కెసిఆర్ పాలన

మాయమాటలతో కెసిఆర్ పాలన

Mancheriala1

మంచిర్యాల అర్భన్: బంగారు తెలంగాణ అంటూ సిఎంకేసిఆర్ తన పాలనలో మాయ మాటల వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను నిత్యం మోసం చేస్తున్నారని  మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. శనివారం హాజీ పూర్ మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన కాంగ్రెస్ పార్టీ క్రీయశీల కార్యకర్తల విస్తృత  స్దాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనికార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బంగారు తెలంగాణ అంటున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ కాదు కదా ఇత్తడి తెలంగాణ కూడా  కాదని ఎద్దేవా చేశారు.నాలుగు విడతల్లో రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో అసలు కాదు కదా వడ్డీలకు సరిపోతుందని అన్నారు.

డబుల్ బెడ్ రూం పథకం పేరుతో ఇంకా ప్రజలను కలల్లోనే ఉండేలా చేస్తున్నారని ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా కూడాపథకం ప్రారంభం కాకపోవడం దారుణమన్నారు. దళితులకు మూడెకరాల భూమి కూడా పూర్తిగా నీరుగారిందని అన్నారు. ఎల్లంపలి ్లప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతల పథకాలను చేప ట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా ప్రారంభించే సమయంలో అదికారంలో లేకపోవడంతో వాటిని ప్రారంభిస్తూ పథకాలు తమవేనంటూ ప్రచారం చేసుకోవడం చోద్యంగా ఉందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనను ప్రజలను గమనిస్తున్నారని రానున్న రోజుల్లో టిఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం తప్పదని అన్నారు.  ఈ సందర్భంగా మం డలంలోని 12 గ్రామపంచాయితీలకు చెందిన పార్టీ కార్యకర్తలతో గ్రామాల వారిగా సమా వేశం నిర్వహించి సలహాలు స్వీకరిస్తూ పార్టీ బలోపేతం కోసం అండగా నిలవాలనికోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ సతీమణి సురేఖ, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్‌లు కమలాకర్‌రావు,రాంచెందర్,సింగిల్ విండో చైర్మన్ చుంచు ఆనందం,నాయకులు సుంకి సత్యం,కుటుంబరావు,రామంచశ్రీనివాస్‌గౌడ్,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.