Home రాష్ట్ర వార్తలు నెగెటివ్ ఆలోచనలు వద్దు

నెగెటివ్ ఆలోచనలు వద్దు

KCRమన తెలంగాణ / హైదరాబాద్: ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు నెగెటివ్‌గా ఎందుకు ఆలోచిస్తున్నాయో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రైతాంగం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న తక్షణ సమ స్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘రుతుపవనాల వైఫల్యం, రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు’ అని ఎజెండాలో చేర్చడంపై ప్రతిపక్ష నాయకుడు కె.జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలపై చర్చ అని పేర్కొనడంపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అంటూ అధికార పక్షాన్ని ప్రశ్నించారు. దీనిపై కెసిఆర్ స్పందిస్తూ, రైతులకు సంబంధించిన ప్రతి అంశంపైనా చర్చించేందుకే, ఇందుకోసం రెండు రోజుల సమయాన్ని కేటాయించడం జరిగిందన్నారు. అసలు ప్రతిపక్షాలు ఏమి కోరుకుంటున్నాయో సూటిగా చెబితే బాగుంటుందన్నారు.

మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో రైతు సమస్య లపై జరిగిన చర్చ సమయంలో నాటి ఎజెండాలోని అంశాలను చదివి వినిపించారు. ఇదంతా మీ పాపమే (రైతుల ఆత్మహత్యలు), ఈ అంశం పై మీకసలు (కాంగ్రెస్) మాట్లాడే హక్కులేదని, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే సమస్య పరిష్కారా నికి నిర్మాణాత్మకమైన సలహాలివ్వాలని కోరారు. జానారెడ్డి స్పందిస్తూ, ఆత్మహత్యల పాపం మీదే నంటూ ఎదురుదాడికి దిగడం ద్వారా ప్రతిపక్షా ల ప్రశ్నలకు సమాధానాలివ్వకుండా సభ నుంచి వెళ్లిపోవాలనే ప్రయత్నంలో ఉన్నారా అంటూ అధికార పక్షాన్ని నిలదీశారు. పాలక పక్షం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే, ఇటువంటి అనుమానాలే తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు.

ఎజెండాలో ఏ అంశాన్ని పొందపర్చినా తమకు అభ్యంతరం లేదని, తాము మాత్రం ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా వాటి ని ఏ విధంగా పరిష్కరించాలో సలహాలిస్తామ న్నారు. సమస్యలను వివరించేందుకు ప్రతిపక్షం, వాటిని పరిష్కరించడం పాలకుల విధి, కర్తవ్యం అన్నారు. వీటన్నింటిని సునిశితంగా పరిశీలించి న తర్వాత ప్రజలు తీర్పు చెబుతారన్నారు. ఇటు వంటి ముఖ్యమైన సమస్యపై సుహృద్భావ వాతా వరణంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని జానా అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి స్పంది స్తూ, పరస్పర నిందారోపణలకు బదులు సమ స్యల శాశ్వత పరిష్కారానికి మార్గాలను చూపే లా చర్చ జరగాల్సి ఉందని, నిర్మాణాత్మకమైన సలహాలను ప్రభుత్వం ఆహ్వానిస్తుందన్నారు.

ఆలేరు ఎన్‌కౌంటర్‌పై చర్చకు సిద్ధం
నల్లగొండ జిల్లా ఆలేరు సమీపాన చోటుచేసు కున్న ఎన్‌కౌంటర్‌పై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. శాసనసభలో మంగళవారం ఆలేరు ఎన్‌కౌంటర్‌పై ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ వాయిదా తీర్మానం ఇవ్వగా, స్పీకర్ ఎస్.మధుసూదనా చారి తిరస్కరించారు. వ్యవసాయం, రైతాంగం ఎదుర్కొంటున్న సమ స్యలపై ప్రత్యేకంగా చర్చించాలని బిఎసిలో నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై ఒవైసీ స్పందిస్తూ, ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తి వేశారని, వాయిదా తీర్మానాన్ని స్వీకరించినట్లు సమాచారమిచ్చి, ఇప్పుడు తిరస్కరించడమేమి టని, ఎన్‌కౌంటర్‌పై చర్చ జరగాల్సిందేనని పట్టు బట్టారు. కెసిఆర్ జోక్యం చేసుకుంటూ, రైతు ఆత్మహత్యల నేపథ్యంలో సమస్య పరిష్కారానికి రెండు రోజుల పాటు సమగ్ర చర్చించాలని బిఎసిలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. ఎన్‌కౌంటర్‌పై చర్చించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. అయినప్పటికీ అక్బరుద్దీన్ తన పట్టు వీడకపోవడంతో శాసనసభ వ్యవహా రాల శాఖ మంత్రి హరీష్‌రావు జోక్యం చేసుకుం టూ, రైతు ఆత్మహత్యలపై చర్చ పూరైన తర్వాత ఎన్‌కౌంటర్ అంశాన్ని చేపడుదామన్నారు.