Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

కెసిఆర్‌ని ముత్తాత రాష్ట్రం బీహార్‌కు తరమాల్సిందే

Telangana Number One State in India Said Chief Minister KCR

నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డి ఎస్సీ సాధన కమిటీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ కెసిఆర్ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఆంధ్ర పాలకుల పెత్తనం కంటే కెసిఆర్ పెత్తనం నైజాం వార సుడిలా ఉందని అన్నారు. కెసిఆర్ పాలన అక్రమాల అధి కార తుగ్లక్ ఎంసెట్ 1,2 రద్దు, 3వ ఎంసెట్ వరకు కొనసాగిందాన్నరు.

గురుకుల నోటిఫికేషన్ 1 రద్దు, గ్రూప్- 2 నోటిఫికేషన్ పదుల సంఖ్యలో తప్పులు, ఇంకా కాని స్టేబుల్ అక్రమాలలో, అవినీతిలో భారతదేశంలోనే నం.1 రాష్ట్రంగా కెసిఆర్ తీర్చిదిద్దారని ఎద్దెవ చేశారు. రాత్రంతాబారు-తెల్లరితే దర్బారు లాగా నోటిఫికేషన్స్ అప్పుడు ఇప్పుడని వాగడం తప్ప చేసిందేమి లేదన్నారు. తెలంగాణ వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్న నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. రాష్ట్రంలో 1.07 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తుందన్నారు. 3 సంవత్సరాలలో 25 వేల పోస్టులు భర్తీ చేయ్యనిధి, ఈ 2 సంవత్సరాలలో మిగిలిన లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, అధ్యక్షులు శివుడు, సాయి కుమార్, విజయ్, నర్సింహా, ఆనంద్, గోపాల్, కృ
ష్ణ, పాండు, రవి, సాగర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments