Search
Wednesday 21 November 2018
  • :
  • :

‘పేద బ్రాహ్మణులకు అండగా ఉంటాం’

KTR

హైదరాబాద్: తెలంగాణలో పేద బ్రాహ్మణులకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే కెసిఆర్ ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. నెక్లెస్ రోడ్ వండర్ పార్క్‌లో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశంలో కెటిఆర్ మాట్లాడారు. బ్రాహ్మణుల స్థితిగతుల గురించి సిఎం కెసిఆర్‌కు తెలిసినంతగా మరెవరికి తెలియదన్నారు. ఆయుత చండీయాగం చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అని, నాలుగేళ్లలో 100 కోట్ల రూపాయలు ఆలయాల అభివృద్ధికి కెసిఆర్ కేటాయించారని గుర్తు చేశారు. రామానుజం పథకం కింద 27 మంది విద్యార్థులకు ఆరు లక్షల రూపాలయు విడుదల చేశామని వివరించారు. మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదించాలని బ్రహ్మణులకు విజ్ఞప్తి చేశారు.

14 వేద పాఠశాలల కోసం రూ. 35.5 లక్షలు విడుదల చేశామని, విదేశీ విద్య పథకం కింద 65 మంది యువతకు రూ7.65 కోట్లు ఇచ్చామని, 13 మంది వేద పండితులు, శాస్త్ర పండితుల కోసం నెలకు 2500 రూపాయలు ఇస్తున్నామని, 125 పేద విద్యార్థుల కోసం 2 లక్షల 25 వేల రూపాయలు విడుదల చేశామని చెప్పారు. వరంగల్‌లో సత్యనారాయణ శర్మ అనే పూజారిని ముష్కరులు చంపేసిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై టిఆర్‌ఎస్ నేతలు స్పందించలేదని రాహుల్ దేశ్ పాండే ఆందోళన వ్యక్తం చేశారు. తాము స్పందించలేదనేది అవాస్తవమని, ఎన్నికల కోడ్ ఉన్నందున దీనిపై మాట్లాడలేదని, ప్రభుత్వ కార్యదర్శి దగ్గర ఈ ఘటనకు సంబంధించిన ఫైల్ ఉందని, శర్మ కుటుంబానికి సహాయం చేసేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కెటిఆర్ స్పష్టం చేశారు.

KCR Support Poor Brahmins

Telangana news

Comments

comments