Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

పేద ప్రజలకు అండగా సంక్షేమ పథకాలు

KCR the Big brother of poor people with welfare schemes

గద్వాల: పేద ప్రజలను దృష్టిలో పేట్టుకుని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు అమలు చేసి అనేక కుటుంబాలకు పెద్దన్నయ్యగా నిలిచారని జిల్లా పరిషత్ చైర్మన్ బండారీ భాస్కర్ అన్నారు. శనివారం స్థానిక ఆర్డిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మేల్యే డికె అరుణ హజరైయ్యారు. ఈ సందర్భంగా జడ్పి చైర్మన్ మాట్లాడుతూ… అనేక మంది పేద ప్రజలకు ఇళ్లల్లో తమ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక పడుతున్న ఇబ్బందులను చూసిన ముఖ్యమంత్రి ఈ పథకం అమలు చేసి అందరికి చేరువయ్యారు. గతంలో రూ.51వేలు ఉండగా అనంతరం రూ.75 వేలు అయిందని తర్వాత 1లక్షకు పెంచారన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్ళి ఈడు వచ్చాకే వివాహాలు చేయాలని బాల్యవివాహాలు చేయరాదని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కళ్యాణమస్తు పథకం వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అదేశించారు. అనంతరం ఎమ్మేల్యే డికె అరుణ మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకున్న వారిని పూర్తిగా విచారించి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ అమలయ్యేలా చూడాలని అధికారులను అదేశించారు. ఈ సందర్భంగా గద్వాల పట్టణ పరిధిలో కళ్యాణలక్ష్మీ ,షాదీముబారక్ ఫథకంలో 15మంది లబ్దిదారులకు రూ. 51,116 వేలు చొప్పున 59 మందికి రూ.71,116 వేల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సుభాన్, మున్సిపాల్ చైర్మన్ కృష్ణవేణీ రామాంజనేయులు తహాసిల్దార్ రాజు, నగేష్, అజీత్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments