Home జాతీయ వార్తలు స్టాలిన్‌ నివాసంలో భోజనం చేసిన కెసిఆర్‌

స్టాలిన్‌ నివాసంలో భోజనం చేసిన కెసిఆర్‌

KCR-IMAGE

చెన్నై: భారత రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోరుతూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న కెసిఆర్ కు ఘనస్వాగతం లభించింది. సిఎం కెసిఆర్ విమానాశ్రయం నుంచి నేరుగా డిఎంకె అధినేత కరుణానిధి నివాసానికి చేరుకున్నారు. అక్కడ డిఎంకె  కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తెలంగాణ సిఎం కు స్వాగతం పలికారు. అనంతరం కెసిఆర్ కురుణానిధితో భేటీ అయి ఆయన ఆరోగ్యం పై ఆరా తీశారు. ఈ సందర్భంగా కరుణానిధి కొన్ని పుస్తకాలను కెసిఆర్ బహుకరించారు. ఆ తర్వాత స్టాలిన్ నివాసానికి చేరుకున్న సిఎం అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పై స్టాలిన్ లో చర్చలు జరిపారు. తెలంగాణ సిఎం ఈ రోజు రాత్రి కి చెన్నైలోనే బస చేసి సోమవారం మరికొంత మంది నేతలో భేటీ కానున్నారు. కెసిఆర్ ఈ పర్యటనకు ఎంపిలు కేశవరావు, వినోద్, మంత్రి ఈటెల రాజేందర్ తదితరులు ఉన్నారు.