Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఈ రోజు కెసిఆర్ కు నిద్రపట్టదు : జగ్గారెడ్డి

Jagga-Reddy

సంగారెడ్డి : సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజాగర్జన సభ చూసి ముఖ్యమంత్రి కెసిఆర్ కు నిద్రపట్టదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఈ ప్రజాగర్జన సభ నాంది అని అన్నారు.  2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించి కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. సోనియాగాంధీ బిక్షతోనే కెసిఆర్ కుటుంబం ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలపై దాడి చేస్తే ప్రతిదాడులు తప్పవని, టిఆర్ఎస్ నేతల బెదిరింపులకు భయపడేది లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ పతనం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

Comments

comments