Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి

Emotionsఆధునికి జీవన శైలికి అలవాటు పడ్డ నేటి తరానికి పలు రకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి.  ఆ సమస్యలకు హోమియోలో మంచి పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు డాక్టర్ శ్రీధర్.

ప్రశ్న: నా వయస్సు 35 సంవత్సరాలు నేను కొద్ది కాలంగా డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నాను. నాకు మూత్రం పోస్తుంటే చురుక్కుమనిపిస్తుంది. మూత్రం చుక్కలు చుక్కలుగా వస్తూ బాధిస్తుంది ఇప్పటికే చాలా రకాల మందులు వాడాను అయినా సమస్య తగ్గటం లేదు. దయచేసి హోమియో వైద్యంలో నా సమస్యకు పరిష్కారం చూపగలరు.  – రాజు, చేర్యాల
జ॥ మీ సమస్యకు సరైన మందు “కాంథారిస్‌” మీరు ఈ మందును వారానికి ఒకసారి ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున నాలుగు వారాలు పాటు వాడగలరు. అలాగే నీళ్లు ఎక్కువగా తాగాలి, మసాలాలు, నూనె పదార్థాలు తగ్గించాలి. ఇలా చేస్తే మీ సమస్య త్వరగా తగ్గుతుంది.
మానసిక స్థాయిలో గందరగోళం పోయేది ఎలా..?
ప్రశ్న: నా వయసు 41 సం॥లు. నేను ఒక సాఫ్ట్‌వేర్ నిపుణుడిగా పరిచేస్తున్నాను. నేను ఎక్కడికైనా వెళ్లవలసి వచ్చినా, ఎవరైనా వస్తున్నారని తెలిసినా, ఏదైన పని తలపెట్టినా మానసిక స్థాయిలో గందరగోళంలో డిప్రెషన్‌కు గురై ఆందోళన చెందుతున్నాను. నాకు రెండు సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు. – సంతోష్,హైదరాబాద్
జ॥ డిప్రెషన్‌కు ప్రధాన కారణాలు మెదడులోని కొన్ని న్యూరోట్రాన్స్ మీటర్ల స్థాయి తగ్గటం, బాహ్య పరిస్థితుల ప్రభావం వలన డిప్రెషన్ మెదలవుతుంది. దీనికి తోడు ప్రవర్తనలో లోపాలు, అసహజ వాంఛలు, దీర్ఘకాలిక వ్యాధులు, ఆత్మన్యూనత భావన, పర్సనాలిటి వ్యాధులు, అనుమానాలు, జన్యుపరమైన కారణాలు, శారీరక సమస్యలు మొదలైన అనేక అంశాలు ‘డిప్రెషన్ ’ ఉత్పన్నం కావడానికి దోహదపడుతున్నాయి.
మీ సమస్యకు ‘అర్జెంటం నైట్రికం.’ అనే మందు సరిపోతుంది ఈమందును 200 పోటేన్సీలో మీరు 15 రోజులకు ఒక్కసారి ఉదయం ఒకడోసు , సాయంత్రం ఒకడోసు చొప్పున మూడు నెలల పాటు వాడగలరు.దీంతో పాటుగా మానసిక ఒత్తిడి తగ్గటానికి తమ చుట్టు ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి, మనసుకు నచ్చిన సంగీతం వినటానికి ప్రయత్నం చేయాలి. ఒంటరిగా ఉండకుండా మిత్రులతో గడపటం, నచ్చిన పర్యాటక ప్రాంతాలకు మిత్రులతో కలిసి వెళ్లాలి. అంతర్మధనాలకు దూరంగా ఉండడం, భావోధ్వేగాలను, ఆలోచనలను, అభిప్రాయాలను అణచిపెట్టకుండా ఎప్పటికప్పుడు ఆత్మీయులతో పంచుకోవడం వంటివి చేస్తే డిప్రషన్ నుండి తొందరగా బయటపడవచ్చు. అలాగే హర్మోనుల సమతుల్యతను కాపాడటానికి మంచి ఆహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్ తో పాటు ఒత్తిడి లేని మంచి జీవన విధానమును అలవరుచుకొనుటకు ప్రయత్నం చేయాలి
మెడ పట్టి పోయేమార్గం లేదా..?
ప్రశ్న: నా వయసు 35 సం॥లు. నేను ఒక కంపనీలో కంప్యూటర్ ఉద్యోగినిగా పని చేస్తున్నాను.నాకు కొంత కాలంగా మెడ కదిలించుటం వల్ల నొప్పి అధికమగుతున్నది. విశ్రాంతి వల్ల నొప్పి తగ్గుతుంది. అలాగే మలబద్దకంతో బాధపడుతుంటాను, దాహం అధికంగా కలిగి ఉండి నీరు ఎక్కువగా తాగుతాను. మానసికంగా నాకు కోపం ఎక్కువ. కదలికల వల్ల నాకు బాధలు ఎక్కువగుతున్నాయి. తిమ్మిర్లు ఎక్కువగా ఉండి, కుడి చెయ్యిపైకి ఎత్తడం కష్టంగా మారుతున్నది. దగ్గరలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించగా ఎక్స్‌రే తీసి స్పాండిలోసిస్ సమస్యగా నిర్ధారించి మెడ పట్టి పెట్టుకోమన్నారు.మెడ పట్టి పోయే మార్గం లేదా…. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు. – జయ కరీంనగర్
జ॥ మీ సమస్యకు ‘బ్రయోనియూ.’ అనే మందు సరిపోతుంది ఈమందును 200 పోటేన్సీలో మీరు 15 రోజులకు ఒక్కసారి ఉదయం ఒకడోసు , సాయంత్రం ఒకడోసు చోప్పున మూడు నెలల పాటు వాడగలరు. అలాగే కాల్కేరియాఫ్లోర్ 6ఎక్స్ అనే మందును రోజుకు 4 మాత్రలు 3 సార్లు చొప్పున 2నెలలు వాడ గలరు. ఈ సమస్య ముఖ్యంగా వెన్నుపూసల మధ్య ఉన్న కార్టిలేజ్ క్షీణించి, ఆస్టియోఫైట్స్ ఏర్పడటం వలన వస్తుంది. కావున స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీలో అసంబద్ద భంగిమలలో కూర్చోవడం మానుకోవాలి. అలాగే ఆహరపు అలవాట్లు మార్చుకోవాలి. కాల్షియం ఉన్న ఆహర పదార్ధాలను తీసుకోవాలి. పాలు, గుడ్లు, పెరుగు వంటివి తీసుకోవాలి, ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం నివారించుకోవాలి. నొప్పి తీవ్రత తగ్గించుకోవటానికి అతిగా పెయిన్ కిల్లర్స్‌ను వాడ కూడదు. నీరు సరిపడినంతగా తాగాలి. తాజా కూరగాయలు నిత్యం ఆహరంలో ఉండే విధంగా తీసుకొవాలి.

Comments

comments