Home తాజా వార్తలు కీర్తిసురేష్‌తో మహేష్ కోనేరు చిత్రం ప్రారంభం

కీర్తిసురేష్‌తో మహేష్ కోనేరు చిత్రం ప్రారంభం

Keerthi Suresh Telugu New Movie‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించిన కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కే కొత్త చిత్రం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో ప్రారంభమైంది. నరేంద్ర దర్శకత్వంలో మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నందమూరి కల్యాణ్‌రామ్ క్లాప్ కొట్టగా… దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ఎస్.హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో కీర్తిసురేష్ మాట్లాడుతూ “తెలుగులో ‘మహానటి’ తర్వాత నటిస్తున్న సినిమా ఇది. మహిళా ప్రధానమైన చిత్రంలో నటిస్తుండడంతో చాలా సంతోషంగా ఉంది. ప్రతి అమ్మాయికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఎక్కువ భాగం యుఎస్‌లో చిత్రీకరణ జరుపుకోనుంది ఈ చిత్రం. దర్శకుడు నరేంద్ర మంచి కథను సిద్ధం చేశారు”అని అన్నారు. దర్శకుడు నరేంద్ర మాట్లాడుతూ “2016 నుండి ఈ కథపై వర్క్ చేస్తున్నాను. అన్ని భావోద్వేగాలు కలగలిసిన కథ ఇది. ఈ కథకు కీర్తిసురేష్ తప్ప మరెవరూ సరిపోరు. 25 శాతం ఇండియాలో 75 శాతం యుఎస్‌లో చిత్రీకరణ జరుగనుంది. ఏప్రిల్‌లో యుఎస్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాం. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభమవుతుంది”అని తెలిపారు. నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ “మహిళా ప్రధానమైన చిత్రమిది. ప్రతి అమ్మాయి తన జీవితంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొనే ఉంటుంది. మహిళలకు కనెక్ట్ అవుతుంది ఈ చిత్రం”అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణ్ కోడూరి పాల్గొన్నారు.

Keerthi Suresh Telugu New Movie Launch