Home జాతీయ వార్తలు ‘కేజ్రీవాల్‌కు మానసిక వైకల్యం ఉంది’

‘కేజ్రీవాల్‌కు మానసిక వైకల్యం ఉంది’

Dharmendra-Pradhanన్యూఢిల్లీ : ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికులు జరిపిన సర్జికల్ దాడులకు సంబంధిచి ఆధారాలు బయటపెట్టాలంటూ మాట్లాడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పెట్రోలియం శాఖ మంత్రి ప్రధాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సర్జికల్ దాడుల్లో ఆర్మీ సాధించిన విజయాన్ని జీర్ణించుకోలేక కేజ్రీవాల్ లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు సర్జికల్ దాడులు జరిగాయా అని అనుమానాలు వ్యక్తం చేసిన కేజ్రీవాల, సంజయ్ నిరుపంలను జాతి క్షమించదని, వారికి మానసిక వైకల్యం ఉందని ఆయన అన్నారు.