Home జాతీయ వార్తలు జమ్మూకశ్మీర్‌పై మోడీని నిలదీసిన ఢిల్లీ సిఎం

జమ్మూకశ్మీర్‌పై మోడీని నిలదీసిన ఢిల్లీ సిఎం

krijivaly
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ లో జిజెపి చేస్తున్న రాజకీయాలపై ఢిల్లీ సిఎం అరవింద్ క్రేజివాల్ తనదైన స్టైల్ లో స్పందించారు. పిడిపి సంకీర్ణ ప్రభుత్వం నుంచి బిజెపి తెగతెంపులు చేసుకోవడంపై క్రేజివాల్ ట్విటర్ లో స్పందించారు. “పెద్దనోట్ల రద్దుతో కశ్మీర్ లో ఉగ్రవాదం వెన్ను విరిచామంటూ బిజెపి మనకు చెప్పలేదా..? మరి ఇప్పుడు ఏం జరిగింది..?” అని ఆయన మోడీని సూటిగా ప్రశ్నించారు. కశ్మీర్ ను సర్వనాశనం చేసి, తర్వాత అక్కడి నుంచి బిజెపి ఇప్పుడు బయటకి వచ్చేసిందని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. పిడిపి తన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదం మరింత పెరిగిపోయిందని ఆరోపణలు చేస్తూ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బిజెపి వైదొలిగిన విషయం తెలిసిందే.